calender_icon.png 29 November, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదభరితంగా కల్వకుర్తి-- రహదారి

29-11-2025 12:54:01 AM

భారీ గోతులు.. పట్టించుకోని అధికారులు..

కల్వకుర్తి, నవంబర్ 28 : కల్వకుర్తి తెలకపల్లి ప్రధాన రహదారిలో పంజుగుల సమీపంలో రోడ్డుపై భారీ గోతులు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  కల్వకుర్తి నుండి మాజీ ఎంపీ పోతుగంటి రాములు స్వగ్రామమైన గుండూరు వరకు ఐదేళ్ల క్రితం రెండు వరుసల రహదారి నిర్మించారు.   నాటి నుండే అక్కడక్కడ గోతులు ఏర్పడి అవి పెద్దయిగా మారాయి.  ఆరు నెలలుగా పరిస్థితి మరింత అధ్వానంగా మారి  రోజు రోజుకూ ప్రమాదాలు పెరుగుతున్నాయని స్థానికులు, ప్రయానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల భారీగా పెరిగిన ఇసుక టిప్పర్ల రాకపోకలే ఈ దెబ్బతినడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. కంకర, ఇసుక ఓవర్లో డ్తో నడుస్తున్న ట్రక్కులు రహదారిని పూర్తిగా ధ్వంసం చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై ఏర్పడిన లోతైన గోతులను గమనించకుండా వెళ్లిన పలువురు వాహనదారులు కింద పడిపోవడం, వాహనాలు దెబ్బతినడం వంటి సంఘటనలు తరచూ నమోదవుతున్నాయి.

ముఖ్యంగా రాత్రివేళల్లో ఈ మార్గంలో కొత్తగా వెళ్లే వారే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్డు భవనాల శాఖ తక్షణమే మరమ్మతులు చేపట్టి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలనీ ఓవర్లోడ్ ఇసుక టిప్పర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలినీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.