calender_icon.png 29 November, 2025 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదాముల్లో వసూల్ రాజాలు!

29-11-2025 12:00:00 AM

  1. ఇరవై ఏళ్లుగా తిష్ట వేసిన కాంట్రాక్టర్
  2. మిల్లర్ల నుంచి అక్రమ వసూళ్లకు తెర లేపిన ముగ్గురు బడా మిల్లర్లు
  3. జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు

నిజామాబాద్ నవంబర్ 28: (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా సెంట్రల్ వేర్ హౌస్ నిర్వహణ పేరిట ఘరానా దోపిడి జరుగుతోంది. గత 20 సంవత్సరాలుగా ఒకరికే నిర్వహణ బాధ్యత ఈ దోపిడీకి రాచబాటగా మారింది. సెంట్రల్ వేర్హౌస్ కార్పొరేషన్ స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ ల గోదాముల తో పాటు ప్రైవేటు రైస్ మిల్లర్ ల సంఘం ఏర్పాటు చేసిన శుభోదయ వేర్హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించే గోడౌన్లో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయి.

లారీల నుండి ధాన్యం అన్లోడింగ్ లో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా గత 20 సంవత్సరాల నుంచి సాగుతోంది. బినామీగా ఒకరిని ఏర్పాటు చేసి ఆయన పేరున తరచూ కాంట్రాక్టు దక్కించు కుంటున్న ముగ్గురు బడా బాబులు రెండు చేతుల అక్రమ సంపాదనకు పాల్పడు తున్నారు. ప్రభుత్వం నుండి హ్యాండ్లింగ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు దక్కించుకున్న వ్యాపారస్తులు తమ అత్యంత నమ్మకస్తుడైన అనుచరుడిని బినామీగా పెట్టి దందా కొనసాగిస్తున్నారు.

వాళ్లు అడిగిన డబ్బులు చెల్లిస్తే వెంటనే లారీలో నుండి ధాన్యం బస్తాలు అన్లోడింగ్ అవుతాయి లేదా రోజుల తరబడి లైన్లోనే నిలిచిపోతాయి. ఫలితంగా మిల్లర్ లు లారీ యజమానులకు వెయిటింగ్ చార్జీలు రోజుకి వెయ్యి రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 10 నుండి 15 రోజుల వరకు వాహనాలు వరుసలో నిలబడి ఉండడంతో చిన్న చితక్క భారీగా మిల్లర్లు డబ్బులు చెల్లించి నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడింది.

దీనికంతటికి కారణం ముగ్గురు బడా బాబులు వారికి బినామీగా ఉండి సహదేవుడు అంతటి సహనంతో సహకరిస్తున్న అత్యంత నమ్మకస్తు డైన వ్యక్తి అని తెలుస్తోంది.  నిబంధన ప్రకారం మిల్లర్లు ఒక్క ఏసీకే అంటే ఒక లోడు 290 క్వింటాళ్లు బస్తాలు, 50 కిలోల బస్తాలు అయితే 580 బస్తాల అన్లోడింగ్ కు మిల్లర్లు రూ:3.500 చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా. లారీలో నుండి బస్తాల అన్లోడింగ్ కై హమాలీలను నియమించకుండా లాగిన్లను వెయిటింగ్ లో పెట్టి మిల్లర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

వీరి వెయిటింగ్ వల్ల లారీలు నిలిచిపోయి అదనంగా వెయిటింగ్ రుసుము భారం పడడంతో మిల్లర్లు నష్టపోతు తామే హమాలిన తెచ్చి ధాన్యం బస్తాలను అన్లోడింగ్ చేసుకున్నప్పటికీని వారి వద్ద నుండి అన్లోడింగ్ హమాలీ డబ్బులు  3,500 రూపాయలు వసూళ్లకు పాల్పడుతున్నారు. లాటింగ్ డబ్బులు ప్రభుత్వం చెల్లించినప్పటికీని మిల్లర్ల వద్ద ముక్కు పిండి వసూలు చేస్తున్నారు.

ఈ విషయమై మిల్లర్లు పలుమార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి విన్నవించగా మిల్లర్ల సమస్య పై స్పందించిన జిల్లా కలెక్టర్ ముని కృష్ణారెడ్డి మిల్లర్లు డంపింగ్ చేసుకుంటే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని వేర్ హౌస్ నిర్వహికులకు ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీని 20 సంవత్సరాలుగా తిష్ట వేసిన ఈ దోపిడి ముఠా మిల్లర్ల నుండి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు.

ఈ వేర్ హౌస్ ల నిర్వహణలో భాగస్వాములుగా ఉన్న వారి మిల్లుల నుండి వారికి వత్తాసు పలుకుతున్న మిల్లర్ల నుండి రాత్రి 9 నుండి 10 గంటల వరకు గేట్లకి తాళాలు వేసి మరి అన్లోడింగ్ చేస్తున్నారు. ఫలితంగా వరుసలో ఉన్న వాహనాలు వారాల కొద్ది నిలబడి పోతున్నాయి. ఫలితంగా మిల్లరులకు వెయిటింగ్ చార్జీలు లారీ ఓనర్లకు చెల్లించక తప్పడం లేదు.