25-12-2025 02:34:30 AM
హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో చలి వణికిస్తోంది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రెండు రోజు లు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పే ర్కొంది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. బుధవారం కొమురం భీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, రంగారెడ్డి, వికారబాద్, కామారెడ్డి, సిద్ధిపేట్, నిర్మ ల్, మెదక్, మహబూబ్‌నగర్, నిజాబాబాద్, నారాయాణపేట్ జిల్లాల్లో 9.9 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదుకాగా, జగిత్యాల్, మేడ్చల్‌మల్కాజ్‌గిరిలో 10 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రెండు రోజులపాటు ఆదిలాబాద్, కామారెడ్డి, కొము రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. బే ఆఫ్ బెంగాల్ నుంచి ప్రతీ సారి మనవైపు హీట్ గాలులు వచ్చేవి. కానీ ఈసారి అవి బలహీనంగా వీస్తున్నాయి. దీనికతోడూ నార్త్, సెంట్రల్ నుంచి చల్లటి గాలులు వీస్తున్నాయి.