22-01-2026 03:43:14 AM
తెలంగాణ దళిత ఐక్యవేదిక నేతల నిరసన
ముషీరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): రానున్న జిహెచ్‌ఎంసీ ఎన్నికల్లో దళితులకు 14శాతం రిజర్వేషన్లు పటిష్టంగా అమలు చేయాలని ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్లలో దళితులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయం ప్రారంబోత్సవం సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా 150 డివిజన్లు ఉన్న సమయంలో దళితులకు 23 సీట్లు కేటాయించారని, అయితే ప్రస్తుతం 300 డివిజన్లకు పెరిగినందున ఎస్సీలకు14శాతం రిజర్వేషన్ల ప్రకారం మొత్తం 46 డివిజన్లు కేటాయించాలని ప్లకార లతో నినాదాలు మంత్రి పొన్నంను తెలంగాణ దళిత ఐక్యవేదిక నాయకలు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా దళిత ఐక్య వేదిక నాయకులు మంత్రి పొన్నంకు వినతి పత్రం అందజేశారు. ఇందుకు స్పందించిన మంత్రి పొన్నం మాట్లాడుతూ మీ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు గండికృష్ణ గజ్జెల సూర్యనారాయణ, మన్నె శ్రీధర్ రావు. కె. వినయ్ కుమార్, రూప్లా వివేక్, గడ్డం నవీన్, ఎవై గిరి, శ్యామ్, స్వామి, దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.