calender_icon.png 29 November, 2025 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జ్యోతిరావు ఫూలేకు ఘన నివాళి

29-11-2025 12:01:56 AM

మేడ్చల్ అర్బన్ నవంబర్ 28 (విజయక్రాంతి):  మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మేడ్చల్ పట్టణంలోని చెక్పోస్ట్ వద్ద గల ఆయన విగ్రహానికి పార్టీలకు అతీతంగా నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్ మాట్లాడుతూ అనగారిన వర్గాల అభ్యున్నతి మహిళల విద్యాభివృద్ధి సమాజంలో సమాన హక్కుల సాధన కోసం మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన పోరాటాలు యుగ యుగాలపాటు గుర్తుండిపోతాయని అన్నారు.

బిజెపి సీనియర్ నాయకులు పాతూరి సుధాకర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పంజగారి ఆంజనేయులు,మార్కెట్ కమిటీ మాజీ  చైర్మన్ ఉదండపురం సత్యనారాయణ, బిజెపి నేతలు చెరుకొమ్ము శ్రీనివాస్ గౌడ్, జాకట ప్రేమ్ దాస్,కానుకంటి వంశీ వంజరి,   మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు గోమారం రమణారెడ్డి, మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ,మున్సిపల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లవంగు రాకేష్ మంజరి, బీఎస్పీ నాయకుడు ముల్లంగిరి శ్రీహరి చారి, ఎన్.ఎస్.యు.ఐ మున్సిపాలిటీ అధ్యక్షులు గుండ శ్రీధర్.గౌడవేల్లి మాజీ వార్డు సభ్యులు మురళి గౌడ్,సందపురం శివకుమార్ కురుమ,ఘనపురం మల్లేష్, తదితరులు నివాళులర్పించారు.

స్ఫూర్తి ప్రదాత  జ్యోతిరావు పూలే...

చేవెళ్ల, నవంబర్ 28(విజయక్రాంతి):  మహాత్మా జ్యోతిరావ్ ఫూలే వర్ధంతిని పురస్కరించుకుని ఆయన సేవలను నేతలు,  స్మరించుకున్నారు. శుక్రవారం  చేవెళ్ల పట్టణ కేంద్రం లో జ్యోతి రావు విగ్రహానికి పలువురు నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సీనియర్ నాయకులు పాండురంగారెడ్డి,  చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్ రెడ్డిలు మాట్లాడుతూ పూలే... అణగారిన వర్గాల కోసం, మహిళా విద్య కోసం తన జీవితం అంకితం చేసిన ఫూలే గారి సమాజ సేవ అనిర్వచనీయమన్నారు.

సమానత్వ భావనకు ఆయన చేసిన కృషి దేశానికి దిశానిర్దేశం చేసిందన్నారు. ఆయన ఆశయాలను పాటిస్తూ ప్రజలకు సేవ చేయడం మా బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో  కుంచం శ్రీనివాస్, మాణిక్య రెడ్డి, శర్వలింగం, కుమార్ గౌడ్,  మిట్ట రంగా రెడ్డి,   కృష్ణ రెడ్డి , పత్తి సత్యనారాయణ, చీర శ్రీనివాస్, అశోక్, గుడుపల్లి మధుసుధా రెడ్డి,  గాజులగూడెం శ్రీనివాస్ రెడ్డి గణేష్, మిట్టు, మహేందర్, రుషికేశ్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, జయసింహ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, మహేందర్ గౌడ్, రామచంద్రయ్య లక్ష్మీనారాయణ పెద్దోళ్ల కృష్ణ, మధుకర్ రెడ్డి పాగా వెంకటేష్ అల్లాడ అభిషేకర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల సాధనకు కృషి చేయాలి 

శంకర్ పల్లి నవంబర్ 28(విజయక్రాంతి): బహుజనులను అక్షర చైతన్యం దిశగాసేవ ఫౌండేషన్ నడిపించిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి రావు పూలే చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని సేవ ఫౌండేషన్ అధ్యక్షుడు నరేష్ కుమార్ పనిచ్చారు. శుక్రవారం జ్యోతి పూలే వర్ధంతి వేడుకను పురస్కరించుకొని శంకర్పల్లి చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతి రావు పూలె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని,ఆయన ధైర్యసాహసాలు, మంచితనం, క్రమశిక్షణ వంటి సుగుణాలను నేటి యువతరం ఆచరించాలని, తద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు పండిత్ రావు, వెంకటేశం,  తదితరులు పాల్గొన్నారు.