29-11-2025 12:00:00 AM
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, నవంబర్ 28 (విజయ క్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల సౌలభ్యం కోసం అందుబాటులోకి తెచ్చిన టీ-పోల్ మొబైల్ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. టీ-పోల్ యాప్ ద్వారా ఓటర్లు తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంది అనే వివరాలను పరిశీలించుకోవడంతో పాటు, ఓటరు స్లిప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు.
అలాగే టి-యాప్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, వాటిని కూడా తెలియజేయవచ్చని అన్నారు. అభ్యంతరాలు, ఫిర్యాదులు ఎం.పీ.డీ.ఓలకు చేరుతాయని, వాటిని పరిశీలించి తక్షణమే పరిష్కరిస్తారని కలెక్టర్ తెలిపారు. ప్లే స్టోర్ నుండి ఈ యాప్ ను https://play.google.com/store/ apps/details?id=com.cgg.gov.in.te_poll_telugu లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు.