calender_icon.png 26 August, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘పవిత్ర’ వృత్తికి వన్నె

26-08-2025 02:29:14 AM

  1. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన సూర్యాపేట జిల్లా టీచర్ మారం పవిత్ర 
  2. విద్యార్థులకు సృజనాత్మకంగా పాఠాలు బోధించడంతో దక్కిన అరుదైన గౌరవం
  3.   45 బెస్ట్ టీచర్ల జాబితాను విడుదల చేసిన కేంద్రం
  4. తెలంగాణ నుంచి ఈ ఏడాది ఒక్కరినే వరించిన పురస్కారం

హైదరాబాద్/ సూర్యాపేట, ఆగస్టు 25 (విజయక్రాంతి)/ పెన్‌పహాడ్: జాతీయ ఉత్త మ ఉపాధ్యాయుల జాబితా-2025ను కేం ద్రం సోమవారం విడుదల చేసింది. మొత్తం 45 మంది టీచర్లకు జాతీయ అవార్డులు వరించాయి. అందులో తెలంగాణ నుంచి ఒక్కరికి చోటు దక్కింది. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో బ యోలజీ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మా రం పవిత్ర జాతీయ అవార్డుకు ఎంపికయ్యా రు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ అధికారికంగా ప్రకటించారు.

అంకితభావం, సృజనాత్మకతతోపాటు నా ణ్యమైన విద్యాబోధనతో రాష్ట్రానికి గౌరవం తెచ్చినందుకు ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్రం నుంచి వెళ్లిన ఆరు నామినేషన్లలో మారం పవిత్ర ఒక్కరే ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఈ అవార్డును సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా అవార్డును ఆమె స్వీకరించనున్నారు. కాగా పవిత్ర 2023లో రాష్ట్రస్థా యిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై ఆనాటి విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకు న్నారు.

విద్యార్థులను తీర్చిదిద్దడంలో సరికొత్త బోధనా పద్ధతులు పాటించడం.. సుల భరీతిలో విద్యాబోధన.. బాలికల విద్యకు ప్రాముఖ్యత.. వినూత్నరీతిలో ప్రయోగశాల బోధన ఇలా అనేక అంశాలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికవ్వడం సంతోషంగా ఉందని మారం పవిత్ర ‘విజయ క్రాంతి’కి తెలిపారు. సూర్యాపేట జిల్లాకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావ టం పట్ల కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ఎంఈవో నకిరేకంటి రవి హర్షం వ్యక్తం చేశారు.

విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మారం పవిత్ర, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు

స్వార్థపూరిత ఆలోచనలతో పనులు చేసే నేటి రోజుల్లో అంకితభావంతో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు చాలా అరుదు. అందులోనూ ఉపాధ్యాయ వృత్తి అత్యంత పవిత్ర మైంది. ఉపాధ్యాయుల పనితనాన్ని గుర్తించే ప్రభుత్వాలు అవార్డులు అందిస్తాయి. ఉత్త మ సేవలు అందజేసిన ఉపాధ్యాయులకు జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం ఈ అవార్డులను అందజేస్తుంటారు. 2025 ఏడాదికిగానూ వివిధ రాష్ట్రాల నుంచి 150 మంది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు కోసం దరఖాస్తులు చేసుకోగా చివరికి 45 మంది ఎంపికయ్యారు. 

తెలంగాణ నుంచి మారం పవిత్రకు ఆ అరుదైన గౌర వం దక్కింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన సందర్భంగా ‘విజయ క్రాంతి’ ఆమెను పలకరించింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వద్ద ఉండే వేములపల్లిలో పుట్టి పెరిగా. జడ్పీహెచ్‌ఎస్‌లోనే చదువుకున్నా. ఏడో తరగతిలో సైన్స్ టీచర్ పాఠాలు అర్థవంతంగా చెప్పటంతో ఆ సబెక్ట్‌పై ఆసక్తి పెరిగింది. ఎన్నో పుస్తకాలు చది వా.. సైన్స్ మీద అవగాహన పెంచుకున్నా. ప్రతిరోజు దినపత్రికలు చదివి ఆప్‌డేట్ అయ్యేదాన్ని, బీజెడ్సీ చదివా.

దాని ప్రభావం ఫలితంగానే అరిస్టాటిల్ నా స్పూర్తి ప్రదాత అయ్యాడు. ఇక నేను చేసిన మొదటి సైన్స్ ప్రయోగం ఆకు తనంతంట తాను ఆహారం తయారు చేసుకుంటుందనే పిండిపదార్థం ప్రయోగం. ఇందుకోసం క్రోటాన్ ఆకుల్ని ఉపయోగించా. 2008లో ప్రభుత్వ టీచరయ్యా.. 2015 నుంచి సూర్యాపేటలోని గడిపల్లి మండలం గడ్డిపల్లిలో, తదుపరి 2024 నుండి పెన్ పహాడ్  మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవ శాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేస్తున్నా. 

డిజిటలైజేషన్‌తో స్వయం అనుభవం.. 

2017 నుంచి డిజిటల్ పాఠాలు చెబుతు న్నా, ఏడో తరగతి నుంచి పదో తరగతి వర కు చెప్పిన 14 సైన్స్ పాఠాలు డీడీ యాదగిరి చానెల్‌లో ప్రసారమయ్యాయి. 2020 నుం చి డిజిటల్ డెవలప్‌మెంట్ కంటెంట్ చేస్తు న్నా. దీక్ష, ఎస్‌సీఈఆర్టీ వాళ్ల సైన్స్ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్‌లు ఉంచారు. వాటిని స్కాన్ చేస్తే వచ్చే వాటిలో 60 వీడియోలు నావే. ఉదాహరణకు ఆకు లోపలి భాగాలను చూ డాలంటే మనకు కష్టం. అదే యానిమేషన్ ద్వారా చేసిన వీడియో చూస్తే ఆసక్తికరంగా ఉంటుంది. వీడియో చూస్తూ ఆకులోపలికి ప్రయాణం చేస్తారు పిల్లలు. డిజిటలైజేషన్ గొప్పతనమిది. ఇక పిల్లలను పోటీల కోసం వేరే ప్రాంతాలకు తీసుకెళ్లాలంటే కష్టం.. తల్లితండ్రులు ఒప్పుకోరు. నేను ఒకప్పుడు సైంటి స్టు కావాలనుకున్నా.. ఇప్పుడు సైంటిస్టులను తయారు చేయడమే నా అంతిమ లక్ష్యం.             

ముఖ్యమైన ప్రయోగాలు ఇవే.. 

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువ. అయినా ఇన్నోవేటివ్ క్రియేటివ్ నా లెడ్జీకి కొదవలేదు. బంకమట్టి, పేడ, కొబ్బరిపీచుతో కుండీ చేసి అందులో మొక్కలు పెం చితే వాటికి పోషకాలు అక్కర్లేదు. ఇక క్యా న్సర్ కారకాలను పీల్చేసే మొక్కల ప్రాజెక్ట్ నాకు బాగా నచ్చింది. ఇంట్లోని టాయిలెట్ క్లీనింగ్ కెమికల్స్‌తో పాటు డీప్ ఫ్రై చేసిన వంటనూనెలోంచి వచ్చే పొగలో క్యాన్సర్ వాయవులుంటాయి. వీటిని ఎయిర్ ప్యూరిఫయర్లుగా పిలిచే కొన్ని మొక్కలు సులు వుగా పీల్చేస్తాయి. 2010లో స్వాతి అనే అమ్మాయి పీవీసీ పైపులో ఎయిర్ ప్యూరిఫయర్ మొక్కలను అమర్చి ఓ ప్రయోగం చేసింది. తక్కువ సూర్యకాంతిలో ఇంట్లో ఎ లా వాటిని పెంచుకోవచ్చనేది ప్రయోగం. నే షనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ పోటీలో కలు పు మొక్కల నుంచి ఆయుర్వేదిక్ మెడిసిన్‌ను తయారు చేశాం.

పవిత్రను వరించిన అవార్డులు

* టెక్ మహీంద్ర,  సైన్స్ టెక్నాలజీ ద్వారా ట్రాన్స్‌ఫార్మింగ్ ఎడ్యుకేటర్ రన్నరప్ 

* లయన్స్ ఇంటర్నేషనల్ నిర్వహించిన వీడియో కాంపిటిషన్‌లో ఉత్తమ ప్రతిభ.. అప్పటి మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా అవార్డు 

* జమ్మూ, కాశ్మీర్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రవివంకర్ శర్మ చేతుల మీదుగా సారాభాయ్ టీచర్ సైంటిస్ట్ నేషనల్ అవార్డు 

* 2022లో ప్రైడ్ విమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 

* 2022లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక.                   

* 2023లో రాష్ర్ట ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక

* 2025లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక