calender_icon.png 22 May, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరంతో లక్ష కోట్లు వృథా

22-05-2025 12:30:45 AM

  1. ఆ నిధులతో కృష్ణా, గోదావరిపై ప్రాజెక్టులు పూర్తయ్యేవి
  2. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  3. సూర్యాపేట జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష

హుజూర్‌నగర్, మే 21: కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని నీటి పారు దల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం అంజనీ సిమెంట్ ఆడిటోరియంలో బుధవారం రాజీవ్‌గాంధీ లిప్ట్ ఇరిగేషన్ స్కీం, ముక్త్యాల బ్రాంచ్ కెనాల్, నక్క గూడెం లిప్ట్ ఇరిగేషన్ స్కీం పనుల పురోగతిపై కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్‌తో కలిసి అధి కారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. కృష్ణానది జలాల పంపకంలో బ్రిజేష్ ట్రిబ్యునల్‌పై గత ప్రభు త్వం తీసుకున్న నిర్ణయంతో దక్షిణ తెలంగాణ ఎడారిలా మారిందని ఆరోపించారు. గత ప్రభుత్వం పదేళ్లు మేడిగడ్డ, కాళేశ్వరం పేరుతో కాలయాపన చేసి లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసింద న్నారకు.

అవే నిధులతో కృష్ణానదిపై భీమా, నెట్టంపాడు, కోయిల సాగర్, కల్వకుర్తి, డిండి, ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ అలాగే గోదావరిపై దేవాదుల, సీతారామ ప్రాజెక్టులు పూర్త య్యేవని తెలిపారు. నక్కగూడెం లిప్ట్ ఇరిగేషన్‌పై మాట్లాడుతూ.. రూ.37.70 కోట్లతో నక్కగూడెం, చింత్రియాల, కిష్టపురం, తమ్మా రం 3,200 ఎకరాలు సాగులోకి వస్తుందని, 2025 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇందిరాగాంధీ ఎత్తిపోతల పథకం..

ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిప్ట్ ఇరిగేషన్ స్కీంకి ఇందిరాగాంధీ ఎత్తిపోతల పథకంగా నామకారణం మంత్రి నామకరణం చేశారు. ఈ స్కీం ద్వారా రూ.1,450 కోట్లతో మఠంపల్లి మండలంలో 20,500 ఎకరాలు, మేళ్లచెర్వు మండలంలో 15,800 ఎకరాలు, చింతలపాలెం మండలంలో 16,700 ఎకరాలు మొత్తం 53,000 ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు. 2026 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

రాజీవ్‌గాంధీ లిప్ట్ ఇరిగేషన్ స్కీంను రూ.394 కోట్లతో మేళ్లచెర్వు, కోదాడ, హుజూర్ నగర్, చింతలపాలెం, చిలుకూరు మండలాల పరిధిలోని 12 గ్రామాలకి చెందిన 14,100 ఎకరాలు సాగులోకి తెస్తామన్నారు. 2026 మే నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

ఈ మూ డు స్కీంల ద్వారా 71,000 ఎకరాలు సాగులోకి వస్తాయని చెప్పారు. ఈ మూడు లిప్ట్ ఇరిగేషన్‌లకి సంబంధించి భూ సేకరణకు రైతులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, ఇరిగేషన్ సీఈ రమేశ్‌బాబు, ఎస్‌ఈ శివధర్మతేజ, డీఈలు చారి, హరికిషోర్, తహసీల్దార్ సురేందర్‌రెడ్డి, ఎంపీడీవో భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

ఉత్తమ్ హెలికాఫ్టర్ అత్యవసర ల్యాండింగ్

మంత్రి ఉత్తమ్‌పర్యటిస్తున్న హెలికాఫ్టర్ వాతావరణం అనుకూలిం చకపోవడంతో అత్యవసరంగా కోదాడ లో ల్యాండ్ అయింది. చింతలపాలెం మండలంలో ఇరిగేషన్ స్కీం పనుల పురోగతి పర్యటన నేపథ్యంలో హెలికాప్టర్‌లో మంత్రి ఉత్తమ్ హైదరాబాద్ నుంచి బయలుదేరారు. 11 గంటల ప్రాంతంలో మేళ్లచెరువులో ల్యాండ్ కావాల్సింది. గాలివాన నేపథ్యంలో ప్రయాణం ఇబ్బందికరంగా మారడంతో అప్రమత్తమైన పైలట్ వాతావరణ కేంద్ర సూచన మేరకు కోదాడలో ల్యాండ్ చేశారు.