calender_icon.png 15 October, 2025 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీ నాయకపోడు లక్ష్మీదేవర్లకు మేడారం మహాజాతరలో విడిదిసత్రాన్ని ఏర్పాటు చేయాలి

15-10-2025 01:00:41 AM

-జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్

-ఆదివాసి నాయకపోడ్ ములుగు జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్

ములుగు, అక్టోబర్ 14 (విజయక్రాంతి) : ఆదివాసి నాయకుడు సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ జాతీయ ఎస్టీ కమిషన్ కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్దేశించి అయినా మాట్లాడుతూ శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరను పురస్కరించుకొని మేడారం మహా జాతరలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సమ్మక్క సారలమ్మకు ఆడబిడ్డ అయినా ఆదివాసి నాయకపోడ్ కులదైవం ఆరాధ్య దైవమైన లక్ష్మీదేవర ప్రతి మేడారం మహా జాతరకు జంపన వాగులో స్నానం ఆచరించి తథానంతరం సమ్మక్క సారలమ్మ గద్దలను ఆదివాసీ నాయకపోడు ఆచార సంస్కృతి సంప్రదాయం  ప్రకారం పూజలు నిర్వహించి  తధానంతరం లక్ష్మీ దేవర్లు చెట్టుకు పుట్టకు ఎక్కడపడితే అక్కడ దేవర్లకు ఒక స్థానం అంటూ లేకుండా జనావాసంలో  తొక్కుటలో ఉండటం జరుగుతుంది దీనివల్ల ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు కీడు సంభవించే అవకాశం ఉందని ఆదివాసీ నాయకపోడ్ కులస్తులు పేద్దలు భావిస్తున్నారు కావున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్ష్మీ దేవర్లు మేడారం మహా జాతరకు దాదాపుగా 150కి పైగా లక్ష్మీదేవర్లు మహా జాతరను ఆచరించే మొక్కలు అప్పజెప్పడం జరుగుతుంది కావున ఈ మొక్కలు అప్పజెప్పిన అనంతరం లక్ష్మీ దేవర్ల విడతి సత్రాన్ని ఏర్పాటు చేయవలసిందిగా జాటోత్ హుస్సేన్ నాయక్ కోరడం జరిగింది. అదే విధంగా ములుగు గట్టమ్మ  దేవాలయం వద్ద అభివృద్ధి చేసేవిధంగా కార్యాచరణ చేయవలసిందిగా కోరారు గట్టమ్మ దేవాలయానికి కావలసిన నిధులను వెంటనే రిలీజ్ చేయాలని కోరడం జరిగింది.