15-10-2025 02:39:07 PM
ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు
జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ఈ నెల 16న భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైల భ్రమరాంభిక మల్లి కార్జున స్వామి దేవస్థాన దర్శనానికి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు, నాగర్ కర్నూల్, కర్నూల్ జిల్లాలో పోలీసులు భద్రత ఏర్పాట్లను సిద్ధం చేశారు. నల్లమల దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఆలయ పరిసరాలోనూ ప్రతి ఒక్కరినీ పూర్తిగా తనికీ చేశాకే లోనికి ప్రవేశం ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భక్తులు భద్రతా పరిశీలన అనంతరం మాత్రమే దేవస్థాన ప్రాంతంలోకి ఉంటుందని అధికారులు ప్రకటించారు. దాదాపు ఆ ప్రాంతంలో ప్రయాణం జరపాలనుకునే వారు ట్రాఫిక్ రద్దీ, ప్రముఖుల రాకకు అదనపు, భద్రత ఉండబోతుంది. భక్తులు ప్రధానమంత్రి దర్శనం తర్వాత తమ దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సూచించారు.