calender_icon.png 2 August, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘జనహిత’కు ఘన స్వాగతం

01-08-2025 12:00:00 AM

బాలాజీని దర్శించుకొని పరిగి వెళ్లిన మీనాక్షి నటరాజన్

హిమాయత్ నగర్, చేవెళ్లలో స్వాగతం పలికిన నేతలు 

 చేవెళ్ల, జులై 31:వికారాబాద్ జిల్లా పరిగి నుంచి ప్రారంభం కానున్న జనహిత పాదయాత్రలో పాల్గొనేందుకు వెళ్తున్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇం చార్జి మీనాక్షి నటరాజన్ కు పార్టీ నాయకులు ఘ నంగా స్వాగతం పలికారు.

గురువారం టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, శాసన సభ వ్యవహారాలు, ఐటీ, పరిశ్రమల శాక మంత్రి దుద్దిల్ల శ్రీధ ర్ బాబు, స్పోరట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, పార్టీ రం గారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ చల్లా నర్సింహా రెడ్డికి చేవెళ్ల మున్సిపాలిటీలోని షాబాద్ చౌరాస్తా వద్ద ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి పామెన భీమ్ భరత్, మ హిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్ ఆధర్వంలో గజ మాలతో వెల్ కం చెప్పా రు.

ఈ సందర్భంగా ప్రత్యేక వాహనంలో కొంత దూరం ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్ నగర్ చౌరాస్తా వద్ద ఎమ్మెల్యే కాలె యా దయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వీరిని రిసీవ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా హిమాయత్ నగర్ చౌరస్తా వద్ద అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం మీనాక్షి నటరాజన్ చిలుకూరు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆమెకు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. వేద మంత్రోచ్ఛరణలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సత్య నారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, టీపీసీసీ నేతలు గౌరీ సతీష్ , షాబాద్ దర్శన్, పీఏసీఎస్ చైర్మన్లు దేవర వెంకట రెడ్డి, గోపె ప్రతాప్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఆగిరెడ్డి, పడాల రాములు, మాజీ జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, సర్పంచుల సంఘం మాజీ మండలాధ్యక్షుడు పడాల ప్రభాకర్, కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నేతలు బూర్ల సాయినాథ్, టేకుల పల్లి శ్రీనివాస్, మద్దెల శ్రీనివాస్, గంగి యాదయ్య తదితరులుపాల్గొన్నారు.