01-08-2025 12:00:00 AM
పదేళ్లుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల కల నెరవేరింది
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల అర్బన్, జూలై 31(విజయ క్రాంతి): గత పదేళ్లుగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల కల నెరవేరిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.గురువారం ధ ర్మపురి నియోజకవర్గంలోని బుగ్గారం, గొల్లపల్లి మండలాల్లో అర్హులైన లబ్దిదారులకు కొత్త రే షన్ కార్డులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తో కలిసి పంపిణీ చేశారు. అదే విధంగా బుగ్గారం లో 21 మంది లబ్దిదారులకు, గొల్లపల్లిలో 64 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నియో జకవర్గంలోని మండల పరిధిలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు. రేషన్ కార్డు రాని వారు కంగారు పడాల్సిన పని లేదని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, కార్డు రాని వారు మీసేవ లో కానీ.. లేదంటే ప్రజాపాలనలో మరో సారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో దాదాపు 10 సంవత్సరాల తర్వాత.. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ కార్డులో కొత్త పేర్లను కూడా కలిపేందుకు అవకాశం కల్పించామని తెలిపారు. వాటన్నింటిని పరిశీలించిన తర్వాత అర్హులైన వారికి మళ్లీ కార్డులు పంపిణీ చేస్తామని వెల్లడించారు. గతం లోఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అందని కార్డులు ఇప్పుడు వారి చేతుల్లోకి రానుండటంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ బియ్యం, నిత్యావసర వస్తువులు తక్కువ ధరకు అందించేందుకు ఈ కా ర్డులు కీలకం కానున్నాయన్నారు.
కొత్త రేషన్ కార్డుల ద్వారా మరిన్ని పేద కుటుంబాలు ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల నుండి లబ్ధిపొందే అవకాశం కలుగనుందన్నారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధు సుధన్, బీసీ వెల్ఫేర్ అధికారి సునీత, డి ఎస్ ఓ జితే ందర్ రెడ్డి, మండల తహసిల్దార్లు, ఎంపీడీవోలు అధికారులు, ప్రజా ప్రతినిధులు,పాల్గొన్నారు.