19-12-2025 12:32:03 AM
తండోపతండాలుగా వచ్చి చూస్తున్న జనాలు
అయిజ, డిసెంబర్ 18: జోగులాంబ గద్వాల జిల్లా అయిజలోని రంగు పేట వీధిలో వేణుగోపాల్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్న పాత ఇంట్లో శ్వేతనాగు పాము కనిపించింది.భయం కంపితులై ఇంట్లోని వారు ఒక్కసారిగా బయటకు వచ్చి జనాలకు తెలియజేశారు.
తెల్లనాగుపాము కావడంతో జనాలు తండోపతండాలుగా వచ్చి చూడడం వింతగా అనిపించింది.అయిజలోని పాములను పట్టే ఒక ముస్లిం వ్యక్తి వచ్చి దానిని నేర్పుగా పట్టి అడవిలో వదిలి పెట్టాడాని ఇంటియజమాని వేణుగోపాల్ అన్నారు. గతంలో కూడా చాల పాములు వచ్చాయని మునిసిపాలిటీ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు.