19-12-2025 12:33:41 AM
వేడుకలకు హాజరైన మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి
మహబూబ్ నగర్, డిసెంబర్ 18(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కార్యాలయంలో సెమీ క్రిస్మస్ సంబరాలు గురువారం పసుపుల గోపాల్ స్వగృహం నందు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి హాజరై సంభాషించారు. క్రిస్మస్ సంబరాలు పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఐక్యతకు మారుపేరుగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని తెలియజేశారు. అందరికీ ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డ్ కాలనీవాసులు తదితరులు ఉన్నారు.