calender_icon.png 19 December, 2025 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక..చుక్క,ముక్క..ఎవరిది వారిదే..

19-12-2025 12:30:19 AM

  1. ముగిసిన మూడు విడతల పంచాయతీల ఎన్నిక

వద్దన్నా మంచి భోజనం  అవసరమైన చుక్క కు సెలవు

ఖాళీ  అవుతున్న గ్రామాలు..

మహబూబ్ నగర్, డిసెంబర్ 18 (విజయక్రాంతి) : ఇక గ్రామాల్లో చుక్క ముక్క ఎవరిది వారిదే. అదేంటి అనుకుంటున్నారా గత నెల రోజులుగా పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరుగును ఉండటంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందడిది మూడు విడత ఎన్నికలు పూర్తి కావడంతో ఒక్కసారిగా చుక్క ముక్క ఖర్చు ఎవరికి వారే పెట్టుకోవాల్సి వచ్చింది.

మొన్నటివరకు ఎక్కడపడితే అక్కడ మనిషి కనిపిస్తే చాలు పలకరింపు తో పాటు అవసరమైన తినుబండారులతోపాటు ఎవరు ఏది కావాలంటే అది వారి దరి చేర్చుతూ ఓటర్ల మండలం పొందిన నేతలు ఒక్కసారిగా జనాన్ని ఎన్నికలు పూర్తికావడంతో వదిలేశారు. దీంతో ఎవరి ఖర్చు వారు పెట్టుకుని పలకరింపులు కరువైన ఇక చేసేదేమీ లేక నేతలు ఇండ్లకే పరిమితమయ్యారు. 

జనంతో నిండిన గ్రామాలు ఖాళీగా దర్శనం..

 మొన్నటి వరకు నిండుగా జనంతో ఉన్న గ్రామాలు ఎన్నికలు పూర్తి అయిన వెంటనే ఒక్కసారిగా దర్శనమిస్తున్నాయి. లక్షలాది రూపాయలను ఖర్చుపెట్టి గెలుపొందిన వారితో పాటు ఓడిపోయిన వ్యక్తులను సైతం అప్పుల బాధలు వెంటాడే అవకాశాలే మెండుగా ప్రదర్శనమిస్తున్నాయి. గెలుపు సంతోషాన్ని ఇచ్చినప్పటికీ ఖర్చుపెట్టిన డబ్బుల విషయంలో మాత్రం అభ్యర్థులు తెగ గాబర పడుతున్నట్లు తెలుస్తుంది. ఎన్నికలు పూర్తి కావడంతో  ఒక్కసారిగా పట్టణాల వైపు జనం ప్రయాణం అవుతున్నారు. 

గ్రామ పాలన సర్పంచ్ చేతుల్లోకి..

 గ్రామ పాలన ఒక్కసారిగా అధికారుల చేతుల్లో నుంచి ఈ నెల 22 నుంచి సర్పంచ్ చేతిలోకి వెళ్లనున్నది. దీంతో గ్రామ అభివృద్ధి ముఖ్యమైన అంశాలను ఇప్పటినుంచే నూతనంగా ఎంపిక అయిన సర్పంచులు ప్రత్యేకంగా అడుగులు వేస్తున్నారు. తమదైన శిరిలో మార్పు చూపించాలని సంకల్పంతో నూతనంగా ఎంపికైన సర్పంచులు ఆ దిశ చర్యలు తీసుకోవడం అందరి దృష్టిని ఆకర్షితం చేస్తుంది. గెలుపుకు దూరంగా ఉన్న అభ్యర్థులు మాత్రం లోలోపలనే అంతర్ మదనపడుతూ ఐదేళ్ల కాలం పాటు ఎలా? అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కునే పడ్డారు.

జడ్పిటిసి,ఎంపిటిసి ఎన్నికల్లో గెలుపు దూరంగా ఉన్న అభ్యర్థులు బరిలో ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఓటర్ల నుంచి సానుభూతి ఉండే అవకాశం ఉండడంతో బరిలో ఉండేందుకు ముగ్గు చూపుతున్నారు. పార్టీల గుర్తులతో ఈ ఎన్నికలు జరగనుండడంతో జనానికి గుర్తులు ప్రత్యేకంగా గుర్తు చేయవలసిన అవసరం లేదనే విషయం కూడా వెలుగులోకి వస్తుంది. దీంతో మరోమారు ఈ ఎన్నికల కోడ్ వస్తే గ్రామాల్లో నేతల హంగామా మరింత కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.