calender_icon.png 15 July, 2025 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యం కోసం వచ్చి అనంత లోకాలకు

14-07-2025 11:01:50 PM

-యునైటెడ్ ఆస్పత్రిలో ఓ మహిళ మృతి 

-మూత్ర విసర్జన రావడం లేదంటూ ఆస్పత్రిలో చేరిన మహిళా 

-లక్ష రూపాయలు ఫీజు చెల్లించి ఆస్పత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు

- ఆసుపత్రిలో ఆవేదన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గిరిజన మహిళ వైద్యం కోసం వచ్చి మృతిచెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట జిల్లా బోన్ పల్లి తండాకు చెందిన దేవమ్మ మూత్ర విసర్జన రాకపోవడంతో జిల్లా కేంద్రంలోని యునైటెడ్ ఆసుపత్రి(United Hospitals)లో ఆదివారం చేరింది. ముందుగా రూ.1 లక్ష చెల్లించాలని వైద్యుల సూచన మేరకు హుటాహుటిన చికిత్స నిమిత్తం రూ.1 లక్ష చెల్లించారు. సోమవారం ఉదయం కూడా మరిన్ని డబ్బులు చెల్లించాలని ఆస్పత్రి వైద్యులు తెలియజేశారు.

బాగా అయిన తర్వాత చెల్లిస్తామని చెప్పడంతో ముందు మీరు అందరూ దేవమ్మకు మాకు సంబంధం లేదనే విధంగా సంతకాలు చేయాలని వైద్యులు సూచించారు. కుటుంబ సభ్యులందరు కలిసి ముందుగా దేవమ్మ ఆరోగ్య పరిస్థితి తెలియజేయాలని తర్వాతనే చెల్లిస్తామని, సంతకాల కూడా చేయబోమని వైద్యులను ప్రశ్నించారు. చివరగా వైద్యులు దేవమ్మ మరణించిందని తెలియజేశారు. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆస్పత్రిలో ఆందోళన వ్యక్తం చేశారు. టూ టౌన్ సీఐ ఇజాజ్, ఎస్సై విజయ భాస్కర్ పోలీస్ బృందం ఆస్పత్రికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో శాంతియుతంగా ఉండాలని ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహన్,  టూ టౌన్ సీఐ ఇజాజ్ కుటుంబ సభ్యులకు  సర్దు చెబుతున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.