calender_icon.png 5 December, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెళ్లి పేరుతో మహిళకు టోకరా

05-12-2025 12:00:00 AM

యూకే డాక్టర్‌నంటూ మ్యాట్రిమోనియల్ సైట్‌లో వల

వీసా ప్రాసెసింగ్ ఫీజు, లేట్ పేమెంట్ ఫెనాల్టీ, హోటల్ ఖర్చులు అంటూ రూ.3.38 లక్షలు కాజేసిన వైనం

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 4 (విజయక్రాంతి): మ్యాట్రిమోనియల్ సైట్ లో యూకే డాక్టర్‌నంటూ మహిళతో పరిచయం పెంచుకున్న వ్యక్తి.. ఆమె నుంచి రూ.3.38 లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. యూకేలో డాక్టర్‌నంటూ హిరాద్ అహ్మద్ అనే పేరున ఓ వ్యక్తి మ్యాట్రిమోనియల్ సైట్‌లో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. రోజూ వాట్సాప్ మెసేజ్‌లు, వీడియో కాల్స్ మాట్లాడుతూ ఆమెను నమ్మించాడు.

ఆమెపై ప్రేమ ఉందంటూ, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ వ్యక్తి మాయలో పడిన బాధితురాలిని నిందితుడు బోల్తా కొట్టించాడు. వీసా ప్రాసెసింగ్ కోసం అంటూ ఆమెతో రెండు కొత్త బ్యాంక్ ఖాతా లు ఓపెన్ చేయించాడు. అలాగే రెండు కొత్త సిమ్ కార్డులు కొనుగోలు చేయించాడు. అనంతరం ఆ బ్యాంక్ పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులను న్యూఢిల్లీలోని యూకే వ్యవహారాల కార్యాలయానికి కొరియర్ చేయాలని ఒత్తిడి చేసి, వాటిని తన ఆధీనంలోకి తీసుకున్నాడు.

ఆమెను పూర్తిగా నమ్మించేందుకు నకిలీ వీసా, వివాహ పత్రాలను ఆన్‌లైన్‌లో పంపాడు. ఆ తర్వాత అసలు నాటకం మొదలుపెట్టాడు. వీసా ప్రాసెసింగ్ ఫీజు అని, లేట్ పేమెంట్ ఫెనాల్టీ, లగేజీ సమస్యలు, హోటల్ ఖర్చులు అంటూ వివిధ కారణాలతో డబ్బు డిమాండ్ చేశాడు. ఇది నిజమేనని నమ్మిన బాధితురాలు విడతల వారీగా రూ. 3,38,200 అత డికి బదిలీ చేసింది. డబ్బు మొత్తం అందాక అతడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. కాంటాక్ట్ నిలిచిపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.