calender_icon.png 5 December, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోకల్.. బిగ్‌ఫైట్!

05-12-2025 12:03:50 AM

మంత్రులు, ఎమ్మెల్యేలకు ‘పంచాయతీ’ టాస్క్ 

  1. డీసీసీ అధ్యక్షులు బాధ్యతగానే పనిచేయాలి 
  2. బీఆర్‌ఎస్ నుంచి గట్టి పోటీ ఉంటుంది 
  3. పార్టీ నాయకులు ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు 
  4. రెండేళ్ల సర్కార్ పనితీరుకు నిదర్శనంగా ప్రజలు చూస్తారు 

పంచాయతీలో తేడా వస్తే ఎంపీటీపీ, జెడ్పీటీసీ, మున్సిపల్..ఎన్నికల్లో ప్రభావం చూపుతోందంటున్న కాంగ్రెస్ నాయకులు 

హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి ): పంచాయతీ ఎన్నికల ప్రచారం రోజురోజుకూ వేడెక్కుతోంది. లోకల్‌గా బిగ్ ఫైట్ కన్పిస్తోంది. పార్టీలకు అతీతంగా జరుగుతున్నా.. తమ మద్దతుదారులను గెలిపించు కునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి. మొదటి విడతలో జరిగే గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యు లకు గుర్తులు కూడా కేటాయించడంతో పోటీ చేసే అభ్యర్థులు, వారికి మద్దతుగా ఆయా రాజకీయ పార్టీలు, నాయకులు ప్రచార రం గంలోకి దూకారు.

గ్రామాల్లో ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రధానప్రతిపక్ష బీఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీల మధ్య నువ్వా.. నేనా అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలను అధికార కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కొత్తగా నియామకమైన డీసీసీ అధ్యక్షులతోపాటు ఇతర ప్రజాప్రతినిధులకు పార్టీ అధిష్ఠానం పెద్ద టాస్క్‌నే పెట్టింది. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులకు కూడా సమన్వయ బా ధ్యతను అప్పగించింది.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్‌చార్జ్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ కూడా జి ల్లాల వారీగా ఎన్నికలపైన ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల ప్రజలు హస్తం పార్టీకి మెజార్టీగా జైకొట్టారు. ఇప్పుడు లోకల్‌బాడీలోనూ క్లీన్‌స్వీప్ చేయాలనే పట్టుదలతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

    అయితే అసెంబ్లీ ఎన్నికల గడువు ముగిసిన వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీనే పూర్తిగా ఆధిక్యత కనబర్చేదని, కానీ, అప్పుడున్న అనుకూల పరిస్థితులు ఇప్పుడు లేవనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల కంటే ఎక్కువగా బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపతున్నారని తెలుస్తోంది. దీంతో బీఆర్‌ఎస్‌కు చాలా చోట్ల రెబల్ అభ్యర్థులు రంగంలో ఉన్నారు.

అంటే బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రారని భావిం చామని, కానీ గ్రామాల్లో ఆ పార్టీ నుంచి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు అభిప్రాయపడ్డారు. అయితే పంచాయతీలను మెజార్టీగా హస్తగతం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు పైకి చెబతున్నప్పటికీ.. స్థానికంగా బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గట్టి పోటీనే ఉంటుందని కాంగ్రెస్ నాయకులే చర్చించుకుంటున్నారు.

అంతేకాకుండా పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకపోవడంతో పాటు స్థానికంగా ధనబలం, కులబలం ఆధారంగానే గెలుపోటములు ఉం టాయని కూడా చెబుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ప్రభావం.. ఆ తర్వాత వచ్చే ఎంపీటీపీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఉంటుందని, అం దుకు ప్రతి నాయకుడు బాధ్యతగా తీసుకుని పనిచేయాలని కాంగ్రెస్ కేడర్‌కు పార్టీ నాయకులు సూచిస్తున్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సానుకూలంగా ఉన్నారని,  సన్నబియ్యం పంపిణీ, రుణమాఫీ, రూ.500 బోనస్, ఉచిత విద్యుత్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వంటి పథకాలు గట్టెక్కిస్తాయనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభు త్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే.. స్థానికంలో గెలి పించాలని కాంగ్రెస్ ప్రచారం ఏ మేరకు ఫలితాలనిస్తోంది వేచి చూడాల్సిందే.