calender_icon.png 5 December, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఉన్నత’ విద్య..

05-12-2025 12:00:00 AM

  1. రెండేళ్లలో విద్య హాబ్‌గా మారిన మహబూబ్‌నగర్

విద్యనిధికి  రూ.50 లక్షలు విరాళాలు 

నియోజకవర్గ విద్యార్థులకుడి జిటల్ మెటీరియల్ పంపిణీ 

రూ.2500కోట్ల పైగా అభివృద్ధి పనులు 

రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్న విజయక్రాంతి దిన పత్రిక

మహబూబ్ నగర్, డిసెంబర్ 4(విజయక్రాంతి): అన్ని రంగాలలో అందనంత ఎత్తులో ఉంచాలని సంకల్పంతో పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి భవిష్యత్తు తరాల బాబు కోసం ప్రత్యేక చర్యలకు శ్రీకారం చూపుతుండ్రు. వెనుకబడిన పాలమూరు జిల్లాను విద్యలో ముందు ఉంచాలని ఉద్దేశంతో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి కంకణం కట్టుకున్నారు.

అందులో భాగంగానే పాలమూరును విద్యా హబ్ గా మార్చాలని ప్రణాళికను రూపొందించి రెండేళ్ల కాలంలో పూర్తిస్థాయిలో అమలుచేసి విద్య హబ్ గా మార్చారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులందరికీ మెరుగైన విద్యను అందించాలని ఉద్దేశంతో తన సొంత నిధులను కేటాయించి విద్యార్థులకు డిజిటల్ మెటీరియల్ పంపిణీ శ్రీకారం చుట్టారు. ఇందుకు సహకరించాలని దాతల్ని కోరగా అధిక సంఖ్యలో దాతలు ముందుకు వచ్చి రూ 50 లక్షలు వరకు విరాళాలను దాతలు ప్రకటించి తమ వంతు మద్దతుగా నిలిచారు.

ప్రభుత్వ పరంగా జిల్లాకు ట్రిబుల్ ఐటీ, లా,కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ వంటివి మంజూరు చేయించి జిల్లాకు ప్రత్యేక స్థానం తీసుకువచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాలను వేగంగా తీసుకువస్తూ తను శ్రీకారం చుట్టిన సొంత కార్యక్రమాలను కూడా ఆదే స్థాయిలో ముందుకు తీసుకుపోతుండ్రు. పాలమూరు నియోజకవర్గం లోని 5000 మంది విద్యార్థులకు డిజిటల్ మెటీరియల్ అందించి వారికి అండగా నిలిచారు.

ప్రైవేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో రాణించాలని ఉద్దేశంతో ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాసరెడ్డి విద్యాభివృద్ధిలో వేగం పెంచారు. ఈ పుస్తకాల ద్వారా గతంతో పోలిస్తే 54% నుంచి 84% వరకు విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కేవలం రెండేళ్లలోపే పాలమూరును విద్య హాబ్ గా తీర్చిదిద్దారు. 

నియోజకవర్గానికి రూ 2500 కోట్ల పైగా నిధులు 

నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించి సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా రూ 2500 కోట్లు మంజూరు చేయించి అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేస్తు న్నా రు. ఎటు చూసినా రోడ్లు, అభివృద్ధి పనులతో నియోజకవర్గ రూపురేఖలతో కలకలలాడుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తోపాటు వివి ధ అభివృద్ధి పనులకు ప్రణాళిక బద్ధంగా చేసుకుం టూ అభివృద్ధి తమ లక్ష్యం బాలల భవిష్యత్తు ధ్యేయం అంటూ ఎమ్మెల్యే వేస్తున్న అడుగులలో అందరూ నడిచేలా అనిపించేలా ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుండ్రు. 

ప్రత్యేక ఆకర్షణగా యెన్నం అన్న హెల్త్ కిట్టు..

తన సొంత నిధులతో నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పులు అయిన ప్రతి మహిళ లకు యెన్నం అన్న హెల్త్ కిట్టును అందిస్తున్నారు. ఇప్పటివరకు 200 మందికి పైగా  యెన్నం అన్న హెల్త్ కిట్లను అందించి వారికి అండగా నిలుస్తున్నారు. ఈ ఒక్క కిట్టుకు రూ 1990  ఎమ్మెల్యే సొంత నిధుల నుంచి ఖర్చు చేయడం విశేషం. ఈ కిట్టులో తల్లి, బిడ్డ ఇరువురికి ఉపయోగపడేలా అవసరమైన సామాగ్రిని ఉంచి అందిస్తున్నారు. ప్రత్యేకంగా నియోజకవర్గ మహిళలకు మాత్రమే ఈ కిట్టు ను అందిస్తున్నారు.  యెన్నం అన్న హెల్త్ కిట్టు ఇతర ఎమ్మెల్యేలకు ఆదర్శంగా నిలుస్తుంది.

వ్యక్తి జీవితంలో చదువు ఎనలేని మార్పులు తెస్తుంది...

 ఓట్ల రాజకీయాలు కాదు భవిష్యత్తు ఉత్తరాల బాబు రాజకీయాలు చేయడమే తమ లక్ష్యం అంటూ ఎమ్మెల్యే తీసుకుంటున్న నిర్ణయాలు అదే పార్టీలో ఉన్న నాయకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మహబూబ్ నగర్ ఫస్ట్ ద్వారా మహిళలకు ఉచిత శిక్షణ అందిస్తూ ఇప్పటివరకు 1200 మందికి శిక్షణ పూర్తి చేయడంతో పాటు వారికి ఉపాధి కల్పిస్తూ మరింత మందికి శిక్షణను యధావిధిగా కొనసాగిస్తున్నారు.

నియోజకవర్గం లోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు శతశాతం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సొంత డబ్బులను ఇచ్చి 31 మంది వాలెంటీర్లను పెట్టి వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తూ పదిలో మెరుగైన ఫలితాలు సాధిస్తే తమ నియోజకవర్గ బిడ్డలకు ట్రిబుల్ ఐటీ సీట్లు లభించే అవకాశం లభిస్తుందని ఆశిస్తూ అందుకు తగ్గట్టు సదుపాయాలను అందుబాటులో ఉంచుతున్నారు. 

గత ఏడాది ఇచ్చిన శిక్షణకు ఎప్సెట్ శిక్షణ తో 116 మంది విద్యార్థులకు ర్యాంకులు రావడంతో సీట్లు లభించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ లేని కార్యక్రమాలను అం కురార్పణ చేసి అభివృద్ధి తమ అంతిమ లక్ష్యం అంటూ చాటి చెబుతూ అడుగులు వేస్తు రెండేళ్లు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయ క్రాంతి దినపత్రిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది.

ఒక్క బిడ్డ బాగుపడితే తరాలు బాగుపడతాయి..

ఓట్ల రాజకీయం చేయడం తమకు తెలియదు. ప్రజలకు మంచి చేయడమే తప్ప మరో ఆలోచన లేదు. చదువు ప్రపంచాన్ని శాసిస్తుంది. ఆ చదువులో వెనుకబడ్డము కనుక మరింత వెనక్కి నెట్టి వేయబడుతున్నాం. నియోజకవర్గ బిడ్డలు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులకు మంచి చదువును అందిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించడంతోపాటు వారి కుటుంబాలకు అండగా నిలుస్తారు.

ఇంతకంటే సంతృప్తి మరెందులోనూ ఉండదనేది నా అభిప్రాయం. విద్యకే కాదు అభివృద్ధిలోనూ కూడా ఎక్కడ రాజీ పడడం లేదు. ప్రతి విషయంలోనూ ప్రణాళిక బద్ధంగా అభివృద్ధిని వేగవంతంగా తీసుకుపోతున్నాం. ప్రతి ఒక్కరు తమకు పూర్తిస్థాయిలో సహకరించడం అదృష్టంగా భావిస్తున్నాను. 

 - యెన్నం శ్రీనివాస్ రెడ్డి,  ఎమ్మెల్యే, మహబూబ్ నగర్