calender_icon.png 5 December, 2025 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏదో చేస్తారని..?

05-12-2025 12:07:38 AM

  1. ధాన్యం తూకం కోసం.. అన్నదాతల ఆగచాట్లు 

పట్టించుకోని అధికారులు

రైతుల ఆశలు అడియాసలు గిట్టుబాబు ధర హుళక్కేనా..?

తాడ్వాయి, డిసెంబర్ 4 (విజయక్రాంతి): రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని చెప్తున్న మరోవైపు    అధికారులు ఆచరణలో విఫలమవుతున్నారు. రైతులకు గిట్టుబాటు ధరను అందిస్తామని భరోసా ఇచ్చిన కార్యాచరణ లో మాత్రం అమలు చేయడం లేదు. సకాలంలో రైతుల ధాన్యానికి తూకం జరగకపో వడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యాన్ని ఎండలో ఆరబోసాం.. తూకం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ధాన్యానికి సకాలంలో తూకం జరుగకకపోవడంతో  రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

15 రోజుల నుంచి ధాన్యాన్ని ఆరబోసుకొని కూర్చున్నా ధాన్యానికి తూకం వేయడం లేదు. స్థానిక సింగిల్ విండో అధికారులు ఏమాత్రం పట్టనట్టు వివరిస్తున్నారు. ఈ విషయమై అధికారులకు చెప్పిన పట్టించు కోవడం లేదని కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని రైతులు బోరుమంటున్నారు. ప్రభుత్వం వరి ధాన్యానికి మద్దతు ధర అందించి ఆదుకుంటామని భరోసా ఇచ్చింది కానీ సకాలంలో రైతుల ధాన్యానికి తూకం వేయడం లేదు.

అధికారులు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారే కానీ రైతుల పరిస్థితిని పట్టించుకోవడంలేదని వారు మండి పడుతున్నారు. తాడ్వాయి మండలంలోని నందివాడ, కృష్ణాజివాడి, బ్రాహ్మణపల్లి, తాడ్వాయి గ్రామాల్లో రైతులు కల్లాల్లో దాన్యాన్ని ఆరబోసి తూకం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. 

వెంటనే తూకం వేయాలి

అధికారులు సకాలంలో స్పందించి వెంటనే తూకం వేయాలని రైతులు కోరుతున్నారు. తమ ధాన్యాన్ని ఆరబోసుకొని తూకం కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వచ్చి తమ ధాన్యానికి తూకం వేస్తారని ఆరాటపడుతున్నారు. అయినా అధికారులు  స్పందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని గ్రామాలలో అధికారులు తూకం వేసిన ధాన్యాన్ని తరలించడం లేదు. దీంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాత్రి వేళలో ధాన్యం వద్దకు వెళ్లి అక్కడే పడుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ధాన్యాన్ని తూకం వేసి ఇక్కడి నుంచి తీసుకువెళ్లాలని రైతులు కోరుతున్నారు. 

తూకం వేసిన ధాన్యాన్ని తీసుకోవడం లేదు 

అధికారులు ధాన్యానికి తూకం వేసిన తీసుకువెళ్లడం లేదు. తూకం వేసి ఎనిమిది రోజులు అవుతుంది. దాన్యాన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్లడం లేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే ధాన్యాన్ని ఇక్కడి నుంచి తరలించాలి.

- గొల్ల రవి, రైతు నందివాడ 

వెంట వెంటనే తూకం వేయాలి 

రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యానికి వెంటనే తూకం వేయాలి తూకం వేసి వెంటనే ధాన్యాన్ని తరలించాలి ధాన్యానికి అధికారులు సకాలంలో తూకం వేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం . ఇప్పటికైనా అధికారుల స్పందించి వెంటనే తూకం వేసి రైతుల బాధలు తొలగించాలి.

- బాలమణి, రైతు నందివాడ