05-12-2025 12:00:00 AM
అశ్వారావుపేట, డిసెంబరు4,(విజయక్రాంతి):అశ్వారావుపేట ప్రధాన రహదారిలో నడుచుకుంటూ వచ్చిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఫుట్పాత్ టీ స్టాల్ వద్ద ఒక్కసా రిగా ఆగారు. అక్కడ టీ తయారు చేస్తున్న యజమానిని దగ్గరకు వెళ్లి పలకరించి, “ఒక కప్పు టీ ఇవ్వండి అన్నా” అని చెప్పడం అం దరినీ ఆశ్చర్యపరిచింది. ఎమ్మెల్యే సహజంగా పక్కనే ఉన్న ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుని టీ తాగుతుండగా, అక్కడ ఉన్న పాదచారులు, చిన్న వ్యాపారులు, ఆటో డ్రైవర్లు ఆయన చుట్టూ చేరారు.టీ స్టాల్ యజమాని మాట్లాడుతూ,మా బండి వద్ద MLA గారు కూర్చొ ని టీ తాగుతారని ఎప్పుడూ ఊహించలేదు.
ఇంత సింపుల్గా జనంతో కలసిమెలసి తిరిగే నాయకుడు అరుదు” అని అభిప్రాయపడ్డారు.ఎమ్మెల్యే టీ తాగుతూ స్టాల్ యజమా ని సమస్యలు, ఆదాయం, రోజువారీ కష్టాల గురించి తెలుసుకున్నారు.అనంతరం ఎమ్మె ల్యే మార్కెట్ బజారును సందర్శించారు. అక్కడ తోపుడు బండ్లపై ఆకుకూరలు, కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్న మహిళలు, వృద్ధులను ప్రత్యేకంగా పలకరించారు.వారితో ఆప్యాయంగా మాట్లాదారు.
మీ అమ్మకాల పరిస్థితి ఎలా ఉంది? ఎవరై నా మీకు ఇబ్బందులు పెడుతున్నారా? ప్రభుత్వ పథకాలు మీకు అందుతున్నాయా? అని ప్రశ్నించారు.చిన్న వ్యాపారుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. మార్కెట్ ప్రాంతంలో సరైన స్థలాలు, షేడ్లు, శానిటేషన్ వ్యవస్థ ఉండేందుకు త్వరలో ప్రణాళిక సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పర్యటనలో భాగంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్ల దుస్థితిని పరిశీలించారు. పాత వీధుల్లో నీటి సరఫరాకు సంబంధించిన సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తెచ్చారు.
అధికారులను పిలిపించి వర్షాకాలం ముగిసింది, వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలి. ప్రజలకి తాగునీరు నిరంతరంగా చేరాలి. వీధి దీపాలు ఎక్కడ పనిచేయడం లేదో వెంటనే లిస్ట్ తీసుకుని మరమ్మతులు చేయాలి అని ఆదేశించారు.పర్యటనలో చిన్నపిల్లలు ఎమ్మెల్యేను చూసి పరుగెత్తుకుంటూ వచ్చారు. వారితో మాట్లాడుతూ బాగా చదువు కోవాలని విద్యార్దులను కోరారు. కొందరు యువకులు ఎమ్మెల్యే తో సెల్ఫీలు తీసుకోవడంతో ఆ ప్రాంతం సందడిగా మారింది.