17-07-2025 12:00:00 AM
భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు
భద్రాచలం, జులై 16, (విజయ క్రాంతి): భద్రాచలం ఆర్డీవో కార్యాలయం లో నిర్వహించిన మూడు రోజుల మెగా ఆధార్ క్యాంపులు ప్రజల నుండి విశేష స్పందన లభించిందని భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు అన్నారు.బుధవారం భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకుమూడు రోజులపాటు జరిగిన ఈ మెగా క్యాంపు ద్వారా 768 మంది పౌరులు తమ ఆధార్ సంబంధిత సమస్యలను పరిష్కరించు కున్నారన్నారు.
మూడు రోజులు పాటు నిర్వహించిన ఈ మెగా ఆధార్ క్యాంపు ద్వారా కొత్త నమోదులు 149 మంది ప్రజలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, అందులో వయోవృద్ధులు, వికలాంగులు,ట్రాన్స్జెండర్, బయో మెట్రిక్, ఇతర అప్డేట్లు జనన తేదీ సవరణలు (ౄOB Limit Cases) ఆధార్ రద్దు కేసులు, సాధారణ ఎంక్వయిరీలు, మొత్తం 619 సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు.
మూడు రో జులపాటు నిర్వహించిన ఈ మెగా ఆధార్ క్యాంపుకు 983 మంది ప్రజలు వచ్చారని ఆయన తె లిపారు. వారిలో సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వారికి, ధ్రువీకరణ పత్రాలు తీసుకొని మీసేవ కేంద్రాల ద్వారా ఆధార్ నవీకరణ చేసుకోవాలని సూచించడం జరిగిందని, చాలా రోజులుగా ప రిష్కారానికి నోచుకోని ఎన్నో ఆధార్ సమస్యలను ఈ ఆధార్ కేంద్రం ద్వారా పరిష్కరించబడ్డాయన్నారు.
ఈ కార్యాక్రమం ద్వారా ప్రజలకు నేరుగా సేవలు అందించడం ద్వారా వారి సమస్యలు తక్షణమే పరిష్కరమయ్యాయని అన్నారు. ఇంకా ఆధార సవరణలు లేదా ఆధార్ ఆధారిత సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేయవలసిన వారు తమ మండలాల్లో ఉన్న ఆధార్ కేంద్రాలను సం ప్రదించవచ్చని, దుమ్ముగూడెం పంచాయతీ కార్యాలయం, తాసిల్దార్ కార్యాలయం, చర్ల ఎంపీడీవో కార్యాలయం తాసిల్దార్ కార్యాలయం, భద్రాచలం బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు త్వరలో పంచాయతీ కార్యాలయంలో ఆధార్ సేవలు అందుబాటులోకి రానున్నాయని,
అవసరమైతే బూర్గంపాడు,భద్రాచలం దగ్గరలోని స్కూల్ ఆధార్ బృందాన్ని సంప్రదించ వచ్చన్నారు. మెగా ఆధార్ క్యాంపును విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన భద్రాచలం ఇన్చార్జి తాసిల్దార్ డానియల్ వెంకటేశ్వర్లు, ఆర్డిఓ ఆఫీస్ ఏవో రాజేంద్రనాథ్, వంశి డిస్టిక్ మేనేజర్ స్కూల్ ఆధార్, భూక్య మోహన్ టెక్నికల్ పర్సన్, సత్యేంద్ర కుమార్ టెక్నికల్ మేనేజర్, కుమార్ కంప్యూటర్ మాన్ హోల్డర్ , సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బంది మెగా క్యాంప్ విజయవంతం అవ్వడా నికి సహకరించిన ప్రజలకు ప్రత్యేకంగా అభినందించారు.