17-07-2025 01:28:34 AM
భీమదేవరపల్లి, జూలై 16 (విజయ క్రాంతి ): ఢిల్లీలో నిర్వహించిన ఓపెన్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామానికి చెందిన గరిగే అభినయశ్రీ రెండు బంగారు పతకాలను సాధించింది. 100 మీటర్లు, 200 మీటర్ల విభాగాల్లో పాల్గొన్న అభినయశ్రీ పోటీలో తన ప్రతిభను చాటుతూ రెండు విభాగాల్లోనూ మొదటి స్థానం దక్కించుకుంది.
తన విజయానికి తల్లిదండ్రులు, కోచ్ మరియు గ్రామస్తుల మద్దతే కారణమని అభినయశ్రీ పేర్కొంది. ఈ ఘన విజయంపై ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామస్థులు, స్థానిక నాయకులు అభినయశ్రీని ఘనంగా సన్మానిస్తూ ఆమె భవిష్యత్తు మరింత వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.