30-08-2025 01:11:18 AM
ఎం.టి.పీ సమావేశం తీర్మానం
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 29, (విజయ క్రాంతి):అర్హత కలిగిన వైద్యుడి చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ లేకుండా గర్భస్రావ మాత్రలను మెడికల్ షాపుల్లో బెక్కరయించరాదని మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎం టీ పీ) తీర్మానించింది. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్ జయలక్ష్మి అధ్యక్షతన ఎంతీపి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా డిఎంహెచ్‌ఓ మాట్లాడుతూ అనధికార అమ్మకాలను నిరోధించడానికి ఎంటీపీ చట్టానికి అనుగుణంగా ఉండేలా కఠినమైన పర్యవేక్షణ నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో స్త్రీ లింగ నిష్పత్తి తగ్గుదల, అక్రమ గర్భస్రావాల సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ఈ సమా వేశంలో కమిటీ సభ్యులు జడ్పీ సీఈవో నాగలక్ష్మి, అదనపు డిఎంహెచ్వో డాక్టర్ సైదులు, డాక్టర్ మధువరన్, డాక్టర్ తేజశ్రీ తదితరులు పాల్గొన్నారు.