calender_icon.png 30 August, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్‌పై బీజేపీ కమిటీ

30-08-2025 01:11:36 AM

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ చర్యలను వేగవంతం చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు శుక్ర వారం ఇందుకోసం ఐదుగురు సభ్యులతో కూడిన మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్, ఎంపీ ఎం రఘునందన్ రావు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా మాజీ అధ్య క్షులు డాక్టర్ ఎన్ గౌతమ్ రావుతో కమిటీని ఏర్పాటు చేశారు.