calender_icon.png 22 September, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల ఆశయాల ప్రతినిధి.. ఏబీవీపీ

22-09-2025 01:12:40 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి):  విద్యార్థుల ఆశయాల ప్రతినిధి, ఏకైక శక్తి ఏబీవీపీ మాత్రమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు అన్నారు.   హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఏబీవీపీ ప్యానెల్ ఘన విజయం సాధించడంపై ఆయన  అభినందనలు తెలిపారు.

ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు.  అలజడి సృష్టించే వామపక్ష, విభజనశక్తులకు గట్టి సమాధానం ఈ విజయమని పేర్కొన్నారు. ఏబీవీపీ దేశభక్తి, జాతీయవాదం, విద్యార్థి సంక్షేమం.. ఈ మూడు స్తంభాలపై పని చేస్తోందని తెలిపారు. వర్సిటీలో 12 విద్యార్థి సంఘాలు ఉన్నా, ఏబీవీపీ తప్ప ఎవరూ ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చేయలేదని తెలిపారు.