calender_icon.png 22 September, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట మునిగిన విద్యుత్ సబ్ స్టేషన్

22-09-2025 01:11:13 AM

-ఆపరేటర్ గదిలోకి వచ్చిన వర్షపు నీరు 

-విద్యుత్ కనెన్షన్లను తొలగించిన అధికారులు

-గతేడాది సెప్టెంబర్‌లో కురిసిన వర్షానికి ఇదే పరిస్థితి..

నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 21 (విజయక్రాంతి ): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణ పరిసరాల్లోని తుమ్మలకుంట చెరువులో ఉన్న కరెంటు విద్యుత్ సబ్ స్టేషన్ నీట మునిగింది. ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఒక్కసారిగా కుంటలోకి నీరు వచ్చి చేరింది. దీంతో కుంట పక్క నే ఉన్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌లోకి నీట మునిగింది.

ఆపరేటర్ గదిలోకి కూడా నీరు చేరడంతో సబ్‌స్టేషన్ ఇన్, అవుట్‌పుట్ విద్యుత్ కనెక్షన్లను సంబంధితఅధికారులు తొలగించారు. సబ్‌సేషన్ పరిధిలోని గ్రామాలకు సైతం కరెంట్ సరఫరా నిలిచిపో యింది.అధికారులు స్పందించి తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ ను మరో సబ్ స్టేషన్ నుంచి ఏర్పాటు చేశారు. గతేడాది సైతం సెప్టెంబర్ నెలలోనే కురిసిన భారీ వర్షానికి విద్యుత్ సబ్ స్టేషన్ నీట మునిగింది. అయినా ప్రభు త్వం, విద్యుత్ శాఖ అధికారులు గుణపాఠం నేర్వకపోవడం విశేషం.