06-12-2025 12:00:00 AM
మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉంది
ఘట్ కేసర్, డిసెంబర్ 5 (విజయక్రాంతి) : ఘనాపూర్ లోని చైల్ గైడెన్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనను కె.పి.ఆర్.ఇ.ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి. సుధీర్ ప్రేమ్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ కె. శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. శ్రీనాథ్ కాశ్యప్, పిఆర్‌ఓ కె. మదన్ మోహన్ ముఖ్య అతిథులుగా హాజరై సందర్శించారు. ఈసందర్శనలో వికలాంగుల జీవన విధానం, వారి ప్రతిభ, అవసరాలు, సామాజిక సమగ్రీకరణపై అవగాహన పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమాలను వారు పరిశీలించారు.
సమాజంలో వికలాంగుల పట్ల అవగాహన, ఆదరణ, సమావేశతను మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంలో డైరెక్టర్ ప్రొఫెసర్ బి. సుధీర్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ మన విద్యార్థులు ఇటువంటి ప్రత్యేక కేంద్రాలను సందర్శించి, అవగాహన పొందడం మాత్రమే కాకుండా, అవసరమైన స్వచ్ఛంద సేవలను అందించడం ద్వారా సమాజానికి ఉపయోగపడాలన్నారు.
కళాశాల చైర్మన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, వైస్ చైర్మన్ కొమ్మూరి ప్రశాoత్, సెక్రటరీ కొమ్మూరి రాకేష్ విద్యార్థులు చైల్ గైడెన్స్ సెంటర్ను సందర్శించి, అవసరమైన వాలంటీర్ సేవలు అందించేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు, వికలాంగుల శ్రేయస్సు సాధనలో కె.పి.ఆర్.ఇ.ఎస్ తరపున మరొక మంచి అడుగు ముందుకు పడింది.