calender_icon.png 6 December, 2025 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత

06-12-2025 12:00:00 AM

కుత్బుల్లాపూర్, డిసెంబర్ 5 (విజయక్రాంతి) : దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ శంభీపూర్ క్రిష్ణ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధి దూలపల్లిలోని అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాములు ఏర్పాటు చేసుకున్న అయ్యప్ప స్వామి మహా పడి పూజా కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చింతల దేవేందర్, మాజీ కౌన్సిలర్ విష్ణు వర్ధన్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బర్మ ప్రవీణ్, దుండిగల్ మున్సిపల్ యూత్ అధ్యక్షులు మైసిగారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.