13-07-2025 01:18:55 AM
నిర్మాణంలో ఉన్న స్లాబ్ సెంట్రింగ్ కూలి నలుగురికి గాయాలు
ఘట్‌కేసర్, జూలై 12: పోచారం మున్సిపల్ వెంకటాపూర్‌లోని అనురాగ్ యూనివ ర్సిటీలో నిర్మాణంలో ఉన్న స్లాబ్ సెంట్రింగ్ కూలి నలుగురికి గాయాలైన సంఘటన శనివారం జరిగింది. అనురాగ్ యూనివర్సిటీ ఆవరణలో నిర్మిస్తున్న భవనం 10వ అంత స్తు స్లాబ్ వేస్తుండగా సపోటుగా ఉన్న సెం ట్రింగ్ జాక్ పక్కకు జరిగి కూలి 9వ అంతస్తులో పడింది. అక్కడ పనిచేస్తున్న నలుగు రు కార్మికులు మహబూబ్‌నగర్‌కు చెందిన రాజు (20), కేశవులు(30), చత్తీస్‌గఢ్‌కు చెందిన రాజు యాదవ్ (34), ఓం ప్రకాష్ (28) గాయపడ్డారు.
వారిని సమీపంలోని నీలిమ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు భవన నిర్మాణ కాం ట్రాక్టర్ తెలిపారు. పోచారం ఐటీ కారిడార్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమా ద తీరును పరిశీలించి ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న బాధితుల నుంచి వివరాలు సేకరించారు. భవన నిర్మాణ కాంట్రా క్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.