13-07-2025 01:20:09 AM
లక్ష మందికి సీపీఆర్‌పై అవగాహన కల్పించడమే లక్ష్యం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 12 (విజయక్రాంతి): సుచిత్ర అకాడమీ ప్రాజెక్ట్ పల్స్ పేరుతో సీపీఆర్ అవగాహనా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎంపవర్.. యాక్ట్.. సేవ్.. అనే ఇతివృత్తంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్‌లోని లక్షమందికి పైగా విద్యార్థులు, టీచర్లు, తల్లిదం డ్రులకు సీపీఆర్‌పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. శనివా రం జరిగిన ప్రారంభ వేడుకలో సీపీఆర్ థీమ్ గీతాలు, ప్రతీకాత్మక క్యాండిల్ లైటింగ్, సీపీఆర్ ప్రాధాన్యతను ప్రతిబింబించే డాన్స్ ప్రదర్శనలను ఏర్పాటు చేశారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పద్మశ్రీ డాక్టర్ గోపిచం ద్ మన్నం, ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్, స్టార్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, గెస్ట్ ఆఫ్ ఆనర్‌గా డాక్టర్ జీవీ రమణారావు హాజరై, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సీపీఆర్‌పై అవగాహన ఉండాలని వివరించారు. డాక్టర్ రాహుల్ కట్టా, ఆయూ హ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ వ్యవస్థాపకులు, స్టార్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ విభాగం గ్రూప్ హెడ్, ప్రాజెక్ట్ పల్స్ సీపీఆర్ హ్యాండ్‌బుక్‌ను ప్రారంభించారు.
విద్యార్థులైన వాలంటీర్లను సీపీ ఆర్ అంబాసిడర్లుగా గుర్తిస్తూ బ్యాడ్జ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుచిత్ర అకాడమీ ఫౌండర్ -డైరెక్టర్ ప్రవీణ్ రాజు మాట్లాడుతూ.. ఇది ఇది కేవలం ఒక పాఠశాల ప్రాజెక్ట్ కాదని, ఇది ఒక సామాజిక మిషన్ అని పేర్కొన్నారు. సీపీఆర్‌పై ప్రతీఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. మాల్స్, జిమ్స్, పాఠశాలల్లో ప్రాజెక్ట్ పల్స్ తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.