29-10-2025 12:16:23 PM
డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం
జడ్చర్ల, (విజయక్రాంతి) విద్యార్థులతో వెళ్తున్న ఆశ్రమపాఠశాల బస్సు రోడ్డు పక్కకు ఒరిగి పోవడంతో 30 మంది విద్యార్థులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన జడ్చర్ల మండల పరిధిలోని కోడుగల్ లింగంపేట మధ్యలో చోటుచేసుకున్నది. జడ్చర్ల మండల పరిధిలోని లింగంపేట గ్రామంలో నదిని నచినికేతన్ ఆశ్రమ పాఠశాల నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలకు కూడికల నుండి బస్సులో విద్యార్థులు హాజరై తిరుగు ప్రయాణంలో లింగంపేట నుండి కోడుగల్కు మంగళవారం సాయంత్రం 30 మంది విద్యార్థులు బస్సులో బయలుదేరారు. ఈ క్రమంలో లింగంపేట కూడగల్ గ్రామ మధ్యలో బస్సు రోడ్డు పక్కకు ఒరిగి ఆగిపోయింది. దీంతో అటుగా వెళుతున్న వారితో పాటు బస్సు డ్రైవర్ అప్రమత్తమై వెంటనే విద్యార్థులను బస్సులో నుండి క్షేమంగా కిందకి దింపారు.
కాక ఇందులో కొంతమంది విద్యార్థులకు స్వల్పదెబ్బలుతగిలాయి. బాలానగర్ నుండి గంగాపూర్ వరకు రోడ్డు నిర్వహణకు టెండర్ పాడి రోడ్డు నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్ గంగాపూర్ నుండి కోడుగల్ వరకు రోడ్డు నిర్మిస్తున్న కాంట్రాక్టర్ గ్రామాల మధ్య రాకపోకలకు మరో రహదారి నిర్మించక పోగా ఉన్న రోడ్డుకు మట్టి అడ్డంగా వేయడంతో పాటు గోతులున్నా కూడా పట్టించుకోకుండా నెలల తరబడి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో తరచుగా ఈ రోడ్డులో ప్రమాదాలు జరిగి పలువురు గాయపడుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం కూడా ఆశ్రమ పాఠశాల విద్యార్థుల బస్సు రోడ్డు పక్కలోని గోతిలోకి ఒరిగిపోయి పెను ప్రమాదం తప్పిందని రోడ్డు కాంట్రాక్టర్ మొదటగా ప్రజల రవాణా సౌకర్యం రాకపోకలకు తాత్కాలికంగా రోడ్డు గుంతలు మెట్టెలు లేకుండా సరిచేసి డబుల్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని లేకపోతే ఆ రోడ్ లో ఉన్న ఆయా గ్రామస్తుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని విద్యార్థులు తల్లిదండ్రులు హెచ్చరించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం పై అధికారులు విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు.