29-10-2025 12:20:15 PM
జడ్చర్ల: (విజయక్రాంతి): సహచర ఉద్యోగి నుంచి వస్తున్న లైగింక వేధిం పులు తట్టుకోలేక మిడ్జిల్ మండలంలోని వెలుగొమ్ముల పంచాయతీ కార్య దర్శి రాజశ్రీ (33) ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుందని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు వెలుగులోకి తీసుకువస్తుంది. సీఐ కమలాకర్ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. అడ్డాకుల మండలంలోని పొన్నకల్ గ్రామానికి చెందిన బండారు రాజశ్రీకి 2016లో నారాయణపేటకు చెందిన నీలి శ్యాంసుందర్ వివాహం జరి గింది. వీరికి కుమార్తె మిథున, కుమారుడు ప్రీతమ్నందన్ ఉన్నారు.
రాజశ్రీ మిడ్జిల్ మండలంలోని వెలుగొమ్ముల పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండడంతో వారు జడ్చర్ల పట్టణంలోని శ్రీవేంకటేశ్వర కాలనీలో అద్దె ఇంటిలో నివాసం ఉంటు న్నారు. జడ్చర్ల బాలాజీనగర్ కు చెందిన శ్రావణ్ మిడ్జిల్ మండల పరిషత్ కార్యాల యంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచే స్తున్నాడు. శ్రావణ్ కొంతకాలంగా రాజశ్రీని మానసిక, శారీరక వేధింపులకు గురిచేస్తు న్నాడు. తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని శ్రావణ్ అనేకసార్లు రాజశ్రీపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని రాజశ్రీ భర్త, కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకొచ్చిం ది. దీంతో వారు శ్రావణ్ న్ని మందలించినా మార్పు రాకపోవడంతో పాటు వేధింపులు తీవ్రం చేశాడు. దీంతో తమ కుమార్తె బలవ న్మరణానికి పాల్పడిందని రాజశ్రీ తండ్రి బండారి రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిం దితుడు శ్రావణ్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మంగ ళవారం బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో మృ తదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుం బసభ్యులకు అప్పగించామన్నారు.