calender_icon.png 1 November, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళను అత్యాచారం చేసిన నిందితునీ అరెస్ట్, రిమాండ్

31-10-2025 11:25:18 PM

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి,(విజయక్రాంతి): ఓ మహిళను అత్యాచారం చేసిన కేసులో నిందితుడును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహిళ పై అత్యాచారం కేసు వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పరిదీ పేట గ్రామానికి చెందిన ఓ మహిళ ఈనెల 26న వ్యవసాయ పనులకు నడుచుకుంటూ వెళ్తుండగా ఆమెను వెంబడించి పట్టుకొని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి నోరు మూయించి అరుపులు కేకలు వేయకుండా అడ్డుకొని ఆమెపై బలవంతంగా అత్యాచారం చేసి పరారైనట్లు బాధితురాలు మాచారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని మాచారెడ్డి పోలీసుల విచారణలో నిందితుడు మహిళపై అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. సమీపంలోని మణికంఠ రైస్ మిల్ లో పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన రాహుల్ కుమార్ గా గుర్తించినట్లు తెలిపారు.

అతడు పరారీలో ఉండడంతో కామారెడ్డి రూరల్ సీఐ రామన్, ఎల్లారెడ్డి సిఐ, మాచారెడ్డి, దేవునిపల్లి, గాంధారి, బిబిపేట ఎస్ఐలు, ఏడు బృందాలుగా ఏర్పాటు చేసి వెతికెందుకు పంపించినట్లు ఎస్పి తెలిపారు. నిందితుడు బీహార్, వెళ్లిపోవచ్చు అని భావిస్తూ ముందస్తుగా, బీహార్, పంజాబ్, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల కు ముందుగా పంపి ప్రత్యేక బృందాలతో వెతికినట్లు తెలిపారు. నిందితుడు నీ ఈ నెల 30న మహారాష్ట్రలోని గొండియా జిల్లాలో నిందితుడుని చాకచక్యంగా పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డి డి.ఎస్.పి శ్రీనివాసరావు, సీఐలు, రామన్, ఎస్సైలు పాల్గొన్నారు.