calender_icon.png 1 November, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయవాదుల సంక్షేమ సాధనలో కలిసి నడుస్తా

01-11-2025 12:00:00 AM

  1. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్, 

హైకోర్టు సీనియర్ న్యాయవాది పొన్నం అశోక్ గౌడ్ 

నిజామాబాద్ లీగల్ కరెస్పాండెంట్, అక్టోబర్ 31 (విజయ క్రాంతి): సర్దార్ వల్లభాయ్ పటేల్ న్యాయవాదిగా, భారత స్వాతంత్ర సమర యోధునిగా, దేశ తొలి ఉప ప్రధాన మంత్రిగా, దేశంలోని ఐదు వందల పైచిలుకు సంస్థానాలను భారత యూనియన్ లో ఏకీకరణ చేసిన అసలు సిసలు దేశ ప్రేమికుడని అన్నారు. పటేల్ వారసునిగా,న్యాయవాదుల కుటుంబ సభ్యునిగా ఉన్న తనకు సమస్యలు తెలుసని వాటి పరిష్కారంలో పాలుపంచుకుంటానని కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయవాది పొన్నం అశోక్ గౌడ్ తెలిపారు.

జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ హల్ లో నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్  150 వ జయంతి వేడుకలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రసంగించారు.పటేల్ కు తెలంగాణ సంస్థానానికి అవినాభావ సంబంధం ఉన్నదని అన్నారు. పటేల్ దూరదృస్టితో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో కలిసి పోవడానికి కారకులైనారని కొనియాడారు.

బ్రిటిష్ వలస పాలకుల నుండి భారత్ స్వాతంత్ర సమూపార్జనకు పటేల్ న్యాయవాద వృత్తి దోహదం చేసిందని పేర్కొన్నారు.గాంధీ, నెహ్రు, అంబేద్కర్, పటేల్ లాంటి న్యాయవాద మొదటి తరం రాజకీయ నాయకత్వం, మేధాసంపత్తి గల వారసత్వమే నేటి భారత నాయకత్వానికి మార్గదర్శిగా నిలిచిందని ఆయన అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయరెడ్డి ప్రాస్తవించిన సమస్యలు పరిష్కరించదగినవేనని వాటి పరిష్కారంలో తనవంతు పాత్ర ఉంటుందని పొన్నం తెలిపారు. న్యాయవాదుల సంక్షేమ సాధనలో కలిసి నడుస్తానని తెలిపారు.

ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ జిల్లా వాసుడైనందున నిధులైన, వనరులలైన వరదలలాగా పారే అవకాశాలే ఎక్కువ అని అశోక్ గౌడ్ చమత్కరించారు. బార్ అధ్యక్షుడు మామిళ్ల మాట్లాడుతు జిల్లాకోర్టుకు దగ్గరగా ఉన్న ఓల్ విద్యాశాఖ కార్యాలయ స్థలం త్వరితిగతిన జ్యూడిషియరికి కేటాయించే విదంగా చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది అమిదాల సుదర్శన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేష్వర్రెడ్డి,  ప్రాసిక్యూటర్స్ దయాకర్ గౌడ్, ఆర్ ఎస్ ఎల్ గౌడ్,న్యాయవాదులు ఎర్రం గణపతి, జక్కుల వెంకటేష్వర్, మధుసూదన్ రావు, రామగౌడ్, ఆశ నారాయణ, రణదీష్, ప్రభాకర్ రెడ్డి, పుష్యమిత్ర తదితరులు పాల్గొన్నారు.