13-08-2025 12:00:00 AM
కన్నాయిగూడెం, ఆగస్టు12(విజయక్రాంతి) : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని సర్వాయి గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. కేసు వివరాల ప్రకారం మూడు రోజుల క్రితం కన్నాయిగూడెం మండలం సర్వాయి గ్రామంలో జరిగిన మడి రాజబాబు (40) హత్య కేసులోని నిందితుడైన కొరం రంజిత్ ని పోలీసులు అదుపులొకి తీసుకున్నారు. ఈ కేసులో పూర్తి విచారణ జరిపిన పోలీసులు,సాక్ష్యాలను సేకరించి,నిందితుడిని అరెస్టు చేశారు.
అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నిందితుడి బావ దగ్గర ఇంటి నిర్మాణ పనులు చేసి తనకు రావాల్సిన కూలీ పైసలు అడిగగా పని చేసిన మిగతా కూలీ వారికి డబ్బులు ఇచ్చి మృతుడు రాజ బాబుకి ఇవ్వడానికి నిరాకరించగా ఆ కూలీ పని డబ్బుల గురించి నిందితుడి బావని నిలదీయగా అట్టి విషయాన్ని మనసులో పెట్టుకుని తన బావని డబ్బులు అడుగుతావా అని కోడిని కోసే కత్తితో రాజబాబు ప్రక్కటెముకల భాగంలో పొడవగా తీవ్ర రక్త స్రావమై మృతి చెందాడు. అనంతరం నిందితుడు పారిపోగా ఏటూరునాగారం సిఐ అనుముల శ్రీనివాస్, కన్నాయిగూడెం ఎస్త్స్ర ఇనిగాల వెంకటేష్, మరియు సిబ్బంది నిన్న సాయంత్రం నిందితుడినీ పట్టుకుని పూర్తి విచారణ జరిపి అనంతరం నిందితుడు కొరం రంజిత్ ని రిమాండ్ తరలించారు.