calender_icon.png 13 August, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్ల అమలులో సీఎంకు చిత్తశుద్ధి లేదు

13-08-2025 01:32:08 AM

డాక్టర్ విశారదన్ మహారాజ్

ముషీరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడంలో ముఖ్య మంత్రి రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి లేదని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ విమర్శించారు. నిజంగా ముఖ్య మంత్రి, పాలక వర్గాలకు బీసీల పట్ల ప్రేమ ఉంటే ఢీల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయం వద్ద ధర్నా చేసి సాధించాలన్నారు.

ఈ మేరకు మంగళవారం బాగ్లింగంపల్లిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఆర్‌ఎం జాక్ రాష్ట్ర కార్యాలయాన్ని బీసీ మేధావుల ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విశారదన్ మహారాజ్ మాట్లాడతూ... 42 శాతం రిజర్వేషన్ ను చట్టబద్దం చేసి 9వ షెడ్యూల్డ్లో చేర్చే వరకు ముఖ్యమంత్రిని వ దలబోమని హెచ్చరించారు. పాలక వర్గాల పల్లకిని మోసే బోయిలము కాదని రేపు బీసీలను పల్లకిలో కూర్చోబెడతామని అన్నారు.

సచివాలయానికి ప్రత్యామ్నాయంగా నిలబడటా నికే కార్యాలయాన్ని ప్రారంభించాం అన్నారు. ఇది రాజ్యం కోసం జరిగే సమరం అన్నారు. చిరంజీవులు మాట్లాడుతూ... కాంగ్రెస్, బీజేపీ, బిఆర్‌ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయ రాజీకీయాలను నడిపించాడానికే ఈ కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ ప్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్, కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, ఎస్. దుర్గయ్య గౌడ్, అంబాల నారాయణ గౌడ్,మానాల కిషన్, రామా గౌడ్, చంద మల్లయ్య, కొండల్ గౌడ్, దాసోజు లలిత, బైరీ శేఖర్, రాఘవేంద్ర ముదిరాజ్, వినోద్ యాదవ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.