13-08-2025 12:00:00 AM
‘ఛలో గాంధీభవన్’ నిరసనలో నిరుద్యోగులు
హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భరీ ్తచేయాలని నిరుద్యోగులు డిమాం డ్ చేశారు. తమ డిమాండ్ల సాధనతో మంగళవారం వారు చేపట్టిన ‘ఛలో గాంధీభవన్’ స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. నిరుద్యోగు లు గాంధీభవన్ వద్దకు వస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు ముందస్తుగా నే వారిని అడ్డుకున్నారు.
పలువురిని అరెస్టు చేసి పలు పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఈక్రమంలో నిరుద్యోగులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తాము గాంధీభవన్‌ను ముట్టడించేందుకు రాలేదని, ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేందుకు వచ్చామని నిరుద్యోగులు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, నిరుద్యోగులను అన్యా యానికి గురిచేయవద్దని విజ్ఞప్తి చేశారు.