calender_icon.png 6 December, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

61 ఏళ్ల వ్యక్తికి అకలేషియా కార్డియా

06-12-2025 12:00:00 AM

ప్రత్యేక ప్రక్రియతో కొత్త జీవితం అందించిన సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్ వైద్యులు

హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రా బాద్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం అరుదైన అకలేషియా కార్డియా వ్యాధితో బాధపడుతున్న 61 ఏళ్ల మహిళకు ఆధునిక పర్ ఓరల్ ఎండోస్కిపిక్ మియోటొమీ (పొఎం) చికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఆ హారం మింగడంలో తీవ్రమైన ఇబ్బంది, దగ్గు, వాంతులు, ఛాతి మండింపు వంటి లక్షణాలు పెరుగుతూ, చివరికి ద్రవాలు కూడా మింగలేని స్థితి రావడంతో రోగి మెడికవర్ వైద్యులను సంప్రదించారు.

పరీక్షించిన వై ద్యులు అకలేషియా కార్డియాగా నిర్ధారించా రు. ఈ వ్యాధిలో లోయర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ సడలకపోవడం వల్ల ఆహారం అన్నవాహికలో చేరి నిలిచిపోవడం, బరువు తగ్గ డం మరియు ఆహారం ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం పెరుగుతాయి. ఈ సవాలుతో కూడిన కేసులో, మెడికవర్ గ్యాస్ట్రో ఎంటరాలజీ బృందం ఎలాంటి బయట కోతలు లే కుండా పూర్తిగా ఎండోస్కోపిక్ విధానంలో పోఎం ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది.

చికిత్స అనంతరం రోగి మరు సటి రోజే ద్రవాలు తీసుకునే స్థితికి చేరుకుని స్పష్టమైన ఉపశమనం పొందారు. ఈ సందర్భంగా మెడికవర్ హా స్పిటల్స్, సికింద్రాబాద్ సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. కృష్ణ గోపాల్ మాట్లాడు తూ, పొఎం వంటి ఆధునిక ఎండోస్కోపిక్ పద్ధతులు అన్నవాహిక వ్యాధుల చికిత్సలో విప్లవాత్మక మార్పు తీసుకొస్తున్నాయి అన్నారు.