calender_icon.png 27 September, 2025 | 8:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

27-09-2025 06:05:20 PM

కాకతీయ యూనివర్సిటీ,(విజయక్రాంతి): కాకతీయ యూనివర్సిటీ బి.సి. సెల్ ఆధ్వర్యంలో "ఆచార్య కొండా లక్ష్మణ్ భాపూజి 110వ జయంతి" సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విశ్వవిద్యాలయ పరిక్షల నియంత్రణ అధికారి ఆచార్య రాజేందర్ కట్ల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని బి.సి. సెల్ సంచాలకులు డాక్టర్ బి. సతీష్ అద్యక్షత వహించారు, ఆడిటోరియం ప్రాంగణంలోని బి.సెల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ భాపూజి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయనకు ఘన నివాళులు అర్పించిన ఆచార్య రాజేందర్ కట్ల మాట్లాడుతూ – "ఆచార్య కొండా లక్ష్మణ్ భాపూజి ఒక ఆదర్శప్రాయుడు. స్వాతంత్య్ర సమరంలోనే కాకుండా, స్వాతంత్ర్యం అనంతరం నిజాం ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో, మొదటి తరం తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన జీవితం ప్రజా సేవకు అంకితం అయ్యింది. ప్రత్యేక తెలంగాణా కోసం కూడా ఆయన గళం విప్పారు. నేటి తరానికి ఆయన జీవితం గొప్ప స్పూర్తిగా నిలుస్తుంది" అని అన్నారు.