27-09-2025 06:00:22 PM
పెద్ద కొడప్గల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోనీ కాంగ్రెస్ మండల కార్యాలయం దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక స్థానం కల్పించిందని శనివారం మండల పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం కౌలాస్ సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ... రాష్ట్ర చరిత్రలో ఎన్నడు ఏ ముఖ్యమంత్రి తీసుకోలేని గొప్ప నిర్ణయం తీసుకొని బీసీలకు న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు అధిక ప్రాముఖ్యత కల్పించినందుకు పెద్ద కోడప్ గల్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల పార్టీ అని గుర్తు చేశారు.