calender_icon.png 27 September, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణ వాది కొండా లక్ష్మణ్ బాపూజీ

27-09-2025 06:09:49 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణ వాది, నిబద్దత కలిగిన రాజకీయ వేత్త, స్వాతంత్య్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని అయన విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం శ్రీకాంత్ రెడ్డి  మాట్లాడుతూ... సమాజంలోని అన్ని వర్గాలకు సమాన రాజకీయ అవకాశాలు కావాలని కోరుకున్న వ్యక్తుల్లో ప్రథముడు బాపూజీ అని కొనియాడారు. క్విట్ ఇండియా పోరాటం, గైర్ ముల్కీ ఆందోళన, తెలంగాణ ఉద్యమంలో బాపూజీ పాత్ర మరువలేనిదని అన్నారు.  స్వరాష్ట్రం కోసం పదవులు,ఆస్తులతో పాటు సర్వస్వం త్యాగం చేసిన తెలంగాణ బాపూజీ గా కొండా లక్ష్మణ్ గారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఆయన ఆశయ సాధనకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.