18-10-2025 12:00:00 AM
ముషీరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): సంఘటిత ఉద్యమాలతోనే కార్మికుల హక్కుల సాధన అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్మిక హక్కుల పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలు జరిగాయి.
కేహెచ్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సురుగు ప్రభాకర్, కార్యదర్శి కల్లెం చంద్రశేఖర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో హాజరైన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ శ్రామికుల శ్రమతోనే దేశంలో సంపద ఏర్పడుతుందన్నారు. సీనియర్ జర్నలిస్టు కాకర్ల సజయ్, శ్రామిక మార్గం ఎడిటర్ మోహన్ బైరాగి, సినిమా కార్మికులు వేదిక లారా, మంచాల వెంకటస్వామి, ప్రజ్యోతుకుమార్, కొల్లా జనార్దన్ జె.ఇందిర, సదానంద్ తదితరులు పాల్గొన్నారు.