calender_icon.png 18 October, 2025 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ బంద్ కు సంపూర్ణ మద్దతు

17-10-2025 11:53:20 PM

హనుమకొండ,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18న జరిగే బీసీ బంద్కు బీసీ.ఏ కులవృత్తుల, సంచారజాతుల రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ పూర్తిగా మద్దతు ప్రకటిస్తుందని జేఏసీ చైర్మన్ పిల్లి రాజమౌళి ప్రకటించారు. శుక్రవారం రోజున  కాకతీయ కాలనీలోని గంగా గార్డెన్  లో బిసిఏ కులాల రిజర్వేషన్ మరియు కులవృత్తుల పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో జేఏసీ చైర్మన్ పిల్లి రాజమౌళి మాట్లాడుతూ బిసి-ఏ గ్రూపు నకు చెందిన కులస్తుల కులవృత్తిని ముదిరాజ్ కులస్తులు ఆక్రమించుకోవడాన్ని నిరసిస్తూ బీసీ-ఏ గ్రూప్ కులాలు కలిసి ఉద్యమించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. అనంతరం బీసీల 42% రిజర్వేషన్ విషయంలో శనివారం రోజున కలెక్టరేట్ కార్యాలయం ముందు బిసి-ఏ గ్రూపు కులస్తులందరూ అధిక సంఖ్యలో బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని సమావేశం ఏకగ్రీవంగా  తీర్మానించడం జరిగింది.