calender_icon.png 19 October, 2025 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పనివేళలు మార్చండి

18-10-2025 12:00:00 AM

ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య కొనసాగించాలి

జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌కి ఉద్యోగ సంఘాల నేతల వినతి

హైదరాబాద్ సిటీ, అక్టోబర్ 17(విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ విభాగంలో పనిచేస్తు న్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు  పని వేళలు, తెల్లవారుజామున 5 గంటలకు కాకుండా, 6 నుంచి 7 గంటల మధ్య కొనసాగేలా చర్యలు తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు వుదారి, గోపాల్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రెటరీ, సంజు, ఎల్‌బీ నగర్ జోన్ అధ్యక్షుడు హనుమంతులు విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు శుక్రవారం జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ కేశవ, పార్టీలను కలిసి, ఉద్యోగుల తరఫున వినతిపత్రం అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎస్‌ఎఫ్‌ఏ చనిపోతే, నిబంధన ప్రకారం అతని భార్యకు ఉన్న విద్యార్హతని బట్టి ఉద్యో గం ఇవ్వాలని, కానీ, ఆమెకు స్వీపర్ ఉద్యో గం ఇవ్వడం, అత్యంత బాధాకర విషయం అన్నారు, ఈ విషయాన్ని, ప్రభుత్వ దృష్టికి త్వరలో తీసుకువెళ్తామన్నారు.

అదేవిధంగా శనివారం ఎల్‌బీ నగర్‌లోని శ్రీనర్సింగ్ హిల్స్‌లో జరిగే సమావేశానికి, ముఖ్యఅతిథిగా హాజరుకావాలని జోనల్ కమిషనర్‌ను విజ్ఞప్తి చేసినట్లు వారు తెలిపారు.ముఖ్యంగా ఈ సమావేశంలో పర్మినెంట్, ఔట్‌సోర్సింగ్‌లో విధులు నిర్వహిస్తున్న జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగాలు ఇచ్చే విధంగా కార్యచరణ రూపొందిస్తున్నామని వారు తెలిపారు.ఈ కార్యక్రమానికి, పర్మినెంట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తప్పనిస రిగా హాజరుకావాలని వారు విజ్ఞప్తి చేశారు