calender_icon.png 24 September, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువజన కాంగ్రెస్ లీడర్‌పై చర్యలు

24-09-2025 12:28:29 AM

ఇందిరమ్మ ఇల్లు మంజూరు పేరుతో డబ్బులు వసూళ్లపై పోలీసులు కేసు నమోదు. 

నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 23 ( విజయక్రాంతి )ఇందిరమ్మ ఇల్లు మంజూరు పేరుతో అధికార పార్టీ లీడర్ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లబ్ధిదారు నుండి పది వేలు డబ్బులు వసూలు చేయడంపై పోలీసులతోపాటు అధికార పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం సిర్సవాడ గ్రామానికి చెందిన ఏదుల భీమమ్మ పొట్టకూటి కోసం వలస వెళ్లగా కాంగ్రెస్ ప్రభుత్వం తనకు నివాసం కల్పిస్తూ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది.

కానీ అదే గ్రామానికి చెందిన చిక్కొండ్ర మల్లేష్ తాడూరు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తూ గ్రామంలోని కొంతమంది లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేశాడు. ఈ క్రమంలో భీమమ్మకు ఫోన్ చేసి 25వేలు డబ్బులు ఇస్తేనే ఇల్లు మంజూరవుతుందని చెప్పడంతో అప్పు చేసి మరీ పది వేలు ముట్ట చెప్పింది. బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మించుకోగా కుటుంబంలోని అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా ఇంటి నిర్మాణం నిలిచిపోయింది.

అందులో చిక్కుండ్ర మల్లేష్ సహకరించినట్లు బాధితురాలు ఆరోపించింది. తాను అడిగిన మరో 15వేలు ఇవ్వనందుకే ఇంటి నిర్మాణానికి అడ్డు తగులుతున్నాడని బాధితురాలు ఆరోపించింది. ఈ విషయంపై యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివంత్ రెడ్డి రఘురాం, స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఆదేశాల మేరకు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తపల్లి వినోద్ మల్లేష్ కు షోకాస్ నోటీసు జారీ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు సైతం విచారించి క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఎస్త్స్ర గురుస్వామి తెలిపారు.