calender_icon.png 24 September, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ సినీ అవార్డుల ప్రదానం.. మురిసిన తెలుగు బలగం

24-09-2025 12:55:07 AM

71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను గత ఆగస్టు 1న ప్రకటించిన సంగతి తెలిసిందే. 2023లో విడుదలైన సినిమాలు, నటులు, సాంకేతిక నిపుణులకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది. ఈ పురస్కారాల ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మంగళవారం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలను, ప్రశంసాపత్రాలను ప్రదానం చేశారు.

ఇదే వేదికపై ప్రతి ష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును మోహన్‌లాల్‌కు అందజేశారు. అంతకుముందు ఆయన శాలువా సత్కారాన్ని స్వీక రించారు. ఇక జాతీయ అవార్డులకు సంబంధించి ఈసారి ఉత్తమ నటుడిగా ఇద్దరికి ప్రకటించిన విషయం విదితమే. ఈ అవార్డును షారుక్‌ఖాన్ (జవాన్), విక్రాంత్ మా స్సే (12th ఫెయిల్) స్వీకరించారు. ఇక ఉత్తమ నటి అవార్డు రాణీ ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే) అందుకున్నారు.

ఈ అవార్డుల్లో భాగంగా మొత్తం 22 భాషల్లో 115 సినిమాలను వీక్షించిన జ్యూరీ కమిటీ అవార్డులను ప్రకటించగా, తెలుగు సినిమాలు ఏడు క్యాటగిరీల్లో అవార్డులు దక్కిం చుకున్న సంగతి తెలిసిందే. ఉత్తమ ప్రాంతీ య తెలుగు చిత్రంగా ఎంపికైన ‘భగవంత్ కేసరి’ దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి అవార్డులను అందుకున్నారు. ‘బేబి’ చిత్రానికి గాను ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును దర్శకుడు సాయి రాజేశ్ స్వీకరించగా, ఇదే చిత్రానికి ఉత్తమ నేపథ్య గాయకుడిగా (‘ప్రేమిస్తున్నా’ గీతం) పీవీఎన్‌ఎస్ రోహిత్ అవార్డు అందుకున్నారు.

‘హనుమాన్’ సినిమాకు ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్స్ విభాగంలో వెంకట్‌కుమార్, యాక్షన్ కొరియోగ్రఫీకి గాను స్టంట్స్ కొరియోగ్రాఫర్లు నందు, పృథ్వీతోపాటు ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌వర్మ, నిర్మాత నిరంజన్‌రెడ్డి అవార్డులు అందుకున్నారు. బలగం సినిమాలో ని ‘ఊరు పల్లెటూరు..’ పాటకు ఉత్తమ గీత రచయితగా కాసర్ల శ్యామ్ అవార్డు స్వీకరించారు.

ఉత్తమ బాలనటి అవార్డును టాలీవు డ్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతివేణి (గాంధీ తాత చెట్టు చిత్రం) అందుకుంది. అ లాగే మన తెలుగు దర్శకులు చేసిన సినిమాలకూ వివిధ కేటగిరీల్లో అవార్డులు వ రించాయి. ఇందులో సందీప్‌రెడ్డి వంగ దర్శక త్వంలో రూపొందిన ‘యానిమల్’ (హిం దీ) సినిమాకు ఉత్తమ నేపథ్య సంగీతం అ వార్డును హర్షవర్ధన్ రామేశ్వర్ అందుకున్నారు.

ఇదే సినిమాకు బెస్ట్ సౌండ్ డిజైన్ విభాగంలో హరిహరన్, సచిన్ సుధాకరన్ అవార్డులు తీసుకున్నారు. వెంకీ అట్లూరి డై రెక్ట్ చేసిన ‘వాతి’ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకత్వం అవార్డును జీవీ ప్రకాశ్‌కుమార్ తమిళ భాష ఎంట్రీ నుంచి అందుకున్నారు. 

అంతా మ్యాజిక్ అనిపిస్తోంది: మోహన్‌లాల్

అవార్డు అందుకున్న సందర్భంగా మోహన్‌లాల్ మాట్లాడారు. “దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని నేను కలలో కూడా ఊహించలేదు. అంతా మ్యాజిక్ అనిపిస్తోంది. ఈ అవార్డు అందుకోవటం గౌరవంగా ఉంది. ఈ పురస్కారం నా ఒక్కడికే కాదు.. ఇది మలయాళ సినీపరిశ్రమకు చెందుతుంది. మరింత బాధ్యతగా పనిచేస్తా” అని తెలిపారు.