24-09-2025 12:16:57 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): భారీగా పెట్టుబడులు పెడుతూ యువతకు ఉపా ధి, వివిధ రకాల పండ్లు సాగు చేసే రైతులకు ప్రోత్సాహం కలిగించే పద్ధతుల్లో బహుళ జాతి కంపెనీలు రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టేందుకు వెల్లువలా కదిలి వస్తున్నాయని డిప్యూటీ సీఎం, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క అన్నా రు. మంగళవారం సచివాలయంలో ఇండస్ట్రీయల్ ప్రమోషన్ కేబినెట్ సబ్ కమిటీ సమా వే శం జరిగింది.
సమావేశంలో మంత్రులు, కేబినెట్ సబ్ కమిటీ సభ్యులైన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొం గులేటి శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు. రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని విధాల ఆసక్తి చూపుతున్న జేఎస్‌డబ్ల్యూ యూఏవీ లిమిటెడ్ మహేశ్వరంలో కొత్త యూనిట్ ప్రారంభించ డా నికి, తోషిబా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం, గ్యాస్ ఇన్సులేటివ్ స్విచ్ గేర్, బుషింగ్స్ పరిశ్రమ ఏర్పాటుకు, హిందుస్థాన్ కోకా కోలా బేవరేజెస్ కంపెనీ ఏర్పాటుకు కేబినెట్ సబ్ కమిటీ ఆమో దం తెలిపింది.
రాష్ర్టంలో ఈ మూడు భారీ కంపెనీల ఏర్పాటు ద్వారా రూ. 3,745 కోట్ల రూపా యల పెట్టుబడులు, 1,518 మంది యువతకు ఉపాధి లభిస్తుందని మంత్రుల బృందం తెలిపిం ది. సుమారు 2,398 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కోకా కోలా బేవరేజెస్ పరిశ్రమ ఏర్పాటు ద్వారా 600 మందికి ఉపాధి లభిస్తుందని, 785 కోట్లతో రూపాయల పెట్టుబడితో వస్తున్న కంపెనీ ద్వారా 364 మందికి ఉపాధి లభిస్తుందని, రూ.562 కోట్ల పెట్టుబడితో వస్తున్న తోషిబా కంపెనీ ద్వారా 554 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు మంత్రులకు వివరించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. కోకాకోలా వంటి కంపెనీల ఏర్పాటు ద్వారా రాష్ర్టంలో మామిడి, నారింజ సాగు చేసే రైతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఏర్పడుతుందని అన్నారు. బేవరేజెస్ పరిశ్రమల ఏర్పాటుతో పెద్ద ఎత్తున ఉద్యాన పం టల ఉత్పత్తులు ఆయా కంపెనీలకు అవసరం అవుతాయని, తద్వారా రాష్ర్టంలో మామిడి, నా రింజ వంటి పంటలు సాగు ఉత్పత్తులకు డిమాం డ్ ఏర్పడి రాష్ర్ట రైతులకు గణనీయంగా ఆదా యం సమకూరుతుంద ని తెలిపారు. దావోస్‌తో పాటు వివిధ దేశాల నుంచి మన రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిన వివిధ కంపె నీలు జరిగిన ఎంవోయూలు, విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు సమీక్షించారు.