calender_icon.png 24 September, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి

24-09-2025 01:32:14 AM

  1. జీఎస్‌టీ శ్లాబ్‌లపై కాంగ్రెస్ నేతలది ఆనవసర రాద్ధాంతం

జోకర్లాగా మాట్లాడుతున్నారు

బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 23ః ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన జీఎస్‌టీ శ్లాబ్‌లపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. సబ్జెక్టు లేనివాళ్లు సొల్లు మాటలు ఎక్కువుగా మాట్లాడతారని పేర్కొన్నారు. నిన్నటిదాకా జీఎస్‌టీ అంటే గబ్బర్ సింగ్ టాక్స్ అని ఎద్దవా చేసినోళ్లు, ఈరోజు మోదీ జీఎస్‌టీ 2.0 సంస్కరణలకు అయోమయంలో పడి,

అర్ధం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. 50 ఏండ్లలో కాంగ్రెస్ చేయలేని ధైర్యం మోడీ చేసి, 17 టాక్సులు, 13 సెస్సులు రద్దు చేస్తూ, జీఎస్‌టీ తెచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు లోటు రాకుండా, ఆ లోటు కూడా 100% కేంద్రం భరించిందన్నారు. స్టేట్ జీఎస్‌టీ వలన వచ్చే ఆదాయంలో కేంద్రం, రాష్ట్రానికి 50:50 వాటా ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మరిచారని నర్సయ్యగౌడ్ పేర్కొన్నా రు. 

మొన్నటి దాకా జీఎస్‌టీ తగ్గించాలిలని కోడై కూసిన రాహుల్ గాంధీ, ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి, ఒక వైపు ఇది మా ఘనత అని, ఇంకో వైపు ఇది రాష్ట్రా లకు నష్టం అని మతి స్థిమితం లేని వ్యాఖ్య లు చేయడం విడ్డూరమన్నారు.    ఇప్పటికైనా విమర్శించే ముందు వాస్తవాలు తెలు సుకోవాలని, మోడీ జీఎస్‌టీ స్లాబ్స్ తగ్గించారు.. తెలంగాణ కాంగ్రెస్ కరప్షన్ స్లాబ్స్ ఎప్పుడు తగ్గిస్తారో తెలియజేయాలని మాజీ ఎంపీ వ్యాఖ్యానించారు.