26-09-2025 12:50:44 AM
* జిల్లా ఎస్పీ కి పిర్యాదు
* బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కురువ విజయ్ కుమార్...
గద్వాల్ సెప్టెంబర్ 25 : పార్టీ ఫిరాయిం చి పోలీసులకు తప్పుడు పిర్యాదు చేసి, కోర్టులను, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ను, ఓట్లు వేసిన గద్వాల నియోజకవర్గ ప్రజలను ఉద్దేశపూర్వకంగా, కుట్రతో మరియు నేరపూరి తంగా మోసం చేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బి ఆర్ ఎస్ పార్టీ రా ష్ట్ర నాయకుడు డాక్టర్ కురువ విజయ్ కు మార్ జిల్లా ఎస్పీ ని కోరారు. గురువారం స్థానిక బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి ఎస్పీ శ్రీనివాస్ రావు కు పిర్యాదు ను అందచేశారు.
అనంతరం ఆయన మీడియా తో మా ట్లాడుతు...ప్రజలచే ఎన్నుకోబడిన గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నాడో అర్థం కాని పరిస్థితుల్లో నియోజకవర్గ ప్రజలు వు న్నారని . తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లు కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని గద్వాల టౌన్ పోలీసు స్టేషన్ లో 11 ఫిబ్రవరి 2025 న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఆ ఫిర్యాదు ఆధారంగా క్రైమ్ నెంబర్ 41/ 2025 తో ఎఫ్.ఐ .ఆర్ కూడా నమోదు చేసినారు .
అదేవిధంగా కృష్ణ మోహన్ రెడ్డి జన్మదినం సంద ర్భంగా గద్వాల పట్టణము లో ఫ్లెక్సీ లు ఏర్పాటు చేశారు. అందులో ఎమ్మెల్యే ప్రధా న అనుచరులే కాంగ్రెస్ పార్టీ జెండాలతో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అని అందరికీ అర్ధమయ్యే రీతిలో ఫోటోలతో పాటు ఫ్లెక్సీ లు ఏర్పాటు చేసినారు. అంతే కాకుండా ఈ నెల 25 న కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ జా తీయ నాయకుల నుంచి నియోజకవర్గ నాయకుల వరకు ఉన్న వేదికను కూడా పం చుకున్నారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కి కృషిచేయాలని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసం గించారు. ఈ కార్యక్రమంలో దానం, ఉపేందర్, రాము, కుమార్, కృష్ణ, దాబా రాజు ,సుధాకర్, మధు, అంజి, నరసింహులు, బజారి, కె. క్రిష్ణ, రాకేష్, కె నరసింహ, జయ న్న, పాండు,నాగేష్, జగదీశ్, గోకరి, మధుసూదన్, గోపాల్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.